షాకింగ్... ఉగ్రవాదులతో పాక్ అనుబంధానికి ఇది తాజా ఉదాహరణ!
ఈ క్రమంలో... నాడు భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లు, శిక్షణా శిబిరాలను తిరిగి స్థాపించడానికి పాకిస్తాన్ చురుకుగా పనిచేస్తోందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
By: Tupaki Desk | 29 Jun 2025 8:30 AM ISTఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు సైన్యం సొంత పిల్లలైతే, ఉగ్రవాదులు దత్తపుత్రులని చెబుతుంటారు. ఈ సమయంలో ప్రపంచం మొత్తం తెలుసుకోవాల్సిన ఓ విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... పాక్ లో ధ్వంసమైన ఉగ్రవాద క్యాంపులను తిరిగి నిర్మిస్తున్నట్లు కథనాలొస్తున్నాయి!
అవును... పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్, పీవోకేలోని 9 ఉగ్రశిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. దీంతో... పాక్ లోని ఉగ్రవాదులకు ఇది ఊహించని భారీ దెబ్బ అనే చర్చ నడించింది.
ఈ క్రమంలో... నాడు భారత సైన్యం ధ్వంసం చేసిన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ లు, శిక్షణా శిబిరాలను తిరిగి స్థాపించడానికి పాకిస్తాన్ చురుకుగా పనిచేస్తోందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ మేరకు నిఘా వర్గాలు తెలిపాయని అంటున్నారు. దీనికోసం పాక్ సైన్య, దాని నిఘా సంస్థ ఐఎస్ఐ, ప్రభుత్వం నిధులతో మద్దతు అందిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ సమయంలో... పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో నియంత్రణ రేఖ (ఎల్.ఓ.సీ) సమీపంలోని దట్టమైన అడవులలో ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు సూచిస్తున్నాయని చెబుతున్నారు. ఈ వ్యూహం.. అటు నిఘా, ఇటు వైమానిక దాడులను తప్పించుకునే లక్ష్యంతో ఉందని కథనాలొస్తున్నాయి.
ప్రస్తుతం పునర్నిర్మించబడుతున్న శిబిరాలు.. లుని, జమిలా పోస్ట్, పుట్వాల్, తైపు పోస్ట్, ఉమ్రాన్వాలి, చోటా చక్, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఉన్నాయని.. ఈ శిబిరాలు థర్మల్ ఇమేజర్లు, రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కోనే విధంగా రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.
కాగా... మే 7న భారత దళాలు పాకిస్తాన్, పీఓకే లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ లకు సంబంధించిన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయి.