Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌కు పెను సంక్షోభం.. PoKపై పట్టు నిలుపుకోవడం కష్టమే!

పాకిస్థాన్ ఇప్పుడు మునుపెన్నడూ లేని ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. PoK (పాక్ ఆక్రమిత కశ్మీర్)పై తమ పట్టును నిలుపుకోవడం కష్టంగా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   17 May 2025 9:00 PM IST
పాకిస్థాన్‌కు పెను సంక్షోభం..  PoKపై పట్టు నిలుపుకోవడం కష్టమే!
X

పాకిస్థాన్ ఇప్పుడు మునుపెన్నడూ లేని ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. PoK (పాక్ ఆక్రమిత కశ్మీర్)పై తమ పట్టును నిలుపుకోవడం కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటేఇకపై చర్చలు కేవలం PoK గురించే జరుగుతాయని భారత్ స్పష్టంగా చెప్పింది. దీంతో PoK ప్రజలు కూడా పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఈ పరిస్థితిలో పాకిస్థాన్‌కు PoKపై అధికారం నిలుపుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకే పాకిస్థాన్ ఒక కొత్త ఎత్తుగడ వేసింది. ఆ ఎత్తుగడ ఏంటో తెలుసుకుందాం.

పహల్గామ్‌లో ఉగ్రదాడి చేయించడం పాకిస్థాన్ సైన్యం, పాలకులకు చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. భారత్ PoKలో ఉన్న ఉగ్ర స్థావరాలను, పాకిస్థాన్ లోపల ఉన్న ఉగ్రవాదుల పెద్దల భవంతులను ధ్వంసం చేసింది. దీని కంటే పెద్ద తప్పు పాకిస్థాన్ భారత్‌పై ఎదురుదాడికి ప్రయత్నించినప్పుడు చేసింది. ఆ ప్రయత్నానికి భారత్ అలాంటి సమాధానం ఇచ్చింది, పాకిస్థాన్ సైనిక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. దీని ఫలితంగా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ నవ్వులపాలవ్వడమే కాకుండా వారికి ఆయుధాలు ఇచ్చే చైనా కూడా అవమానపాలైంది.

దీంతో పాకిస్థాన్ తప్పనిసరి పరిస్థితుల్లో మోకాలిపై నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు భారత్‌ను ఆపడం అసాధ్యం. PoK తిరిగి వచ్చే వరకు పాకిస్థాన్‌పై ముప్పు అలాగే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఆగింది అంటే పాకిస్థాన్‌పై చర్యలు ఆగిపోయాయని కాదు. బదులుగా పాకిస్థాన్‌పై అలాంటి చర్యలకు ఇది ప్రారంభం దీనిని పాక్ పాలకులు, సైన్యం బహుశా ఎప్పుడూ ఊహించి ఉండరు.

భారత్ ఇక పాకిస్థాన్ నుంచి PoKను విడిపించాలని నిర్ణయించుకుంది. ఈ దిశగా భారత్ తన అడుగులు కూడా ముందుకు వేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పారు ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే, సరైన సమయంలో అసలు సినిమా చూపిస్తాం అని. మరోవైపు కశ్మీర్ గురించి గొంతు చించుకుని అరిచే పాకిస్థాన్ పాలకులు, సైన్యాధిపతులు ఈ వాస్తవాన్ని చూసి దిగ్భ్రాంతి చెందారు.

PoKపై అక్రమ ఆక్రమణతో విసిగిపోయిన ప్రజలు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇది భారత్ మిషన్ పీవోకేకి అక్కడి ప్రజల పూర్తి మద్దతు ఉందని తెలియజేస్తుంది. అంటే ఆపరేషన్ సింధూర్ పీవోకే ప్రజలకు ఒక లక్ష్యాన్ని ఇచ్చింది. ఆ లక్ష్యం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి వారి ప్రాంతానికి స్వేచ్ఛ. దీని అర్థం పీవోకే పాకిస్థాన్ చేతుల్లోంచి జారిపోతోంది. ఎందుకంటే పీవోకే తిరిగి వచ్చే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపమని, ఎలాంటి ఒప్పందాలు పునరుద్ధరించమని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది.

కాబట్టి భారత్ పీవోకేను తిరిగి తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుందని స్పష్టంగా తెలుస్తోంది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ నిన్ననే చెప్పారు పాకిస్థాన్‌తో చర్చించడానికి ఒకే ఒక విషయం ఉంది అది PoK తిరిగి ఇవ్వడం అని. పాకిస్థాన్ వైపు నుండి ఉగ్ర కార్యకలాపాలు ఆగేవరకు సింధు జలాల ఒప్పందం కూడా నిలిపివేయబడుతుంది. అంటే పాకిస్థాన్‌పై సైనిక చర్య కేవలం పహల్గామ్ దాడికి బదులు లేదా పాకిస్థాన్ చర్యకు సమాధానం మాత్రమే కాదు.. ఇది పాకిస్థాన్‌కు ఇచ్చిన ఒక తుది హెచ్చరిక, దీనిని పీవోకే ప్రజలు అర్థం చేసుకున్నారు.

అయితే ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి పాలకులకు, సైన్యానికి వేరే మార్గం లేదు. అందుకే చైనాను మధ్యలోకి లాగి ఒక అడ్డంకి సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. ఒకవేళ PoK ప్రజలే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే పాకిస్థాన్‌కు గట్టి సమాధానం చెప్పినట్లే. అందుకే పీవోకే చేజారిపోయే పరిస్థితిని గ్రహించిన పాకిస్థాన్ చైనాను మధ్యలోకి లాగుతోంది. కానీ చైనానే ఎందుకు? నిజానికి జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌తో చైనాకు రెండు ప్రాంతాలపై వివాదం ఉంది. మొదటిది లడఖ్ తూర్పు ప్రాంతం, రెండవది అక్సాయ్ చిన్. అయితే కశ్మీర్ విషయంలోఎవరి జోక్యం సహించేది లేదని భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. అందుకే పీవోకే పై తమ పట్టును నిలుపుకోవడానికి పాకిస్థాన్ ఈ విషయంలో చైనాను ఎంటర్ చేయించింది.