Begin typing your search above and press return to search.

పాక్ కి అణుబాంబు ఆపరేషన్ తెలియదా ?

ఇక పాకిస్థాన్ నోట తరచూ వచ్చే మాట ఒకటి ఉంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని.

By:  Tupaki Desk   |   12 May 2025 1:00 PM IST
పాక్ కి అణుబాంబు ఆపరేషన్ తెలియదా ?
X

పాకిస్థాన్. ప్రతీ నిత్యం భారత్ మీద పడి ఏడిచే దాయాది దేశం. భారత్ ఏ ఆయుధం కొంటే తన దగ్గర అదే ఉండాలని తాపత్రయపడే నైజం కలిగిన దేశం. అయినా సరే చవక రకం ఆయుధాలనే తన వద్ద పోగు చేసుకుని అక్కడికి ఏదో భారత్ ని జయించేసినట్లు కలలు కంటున్న ఒక పిచ్చి ఉన్మాద దేశం.

ఇక పాకిస్థాన్ నోట తరచూ వచ్చే మాట ఒకటి ఉంది. మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని. అవి వందకు పైగా ఉన్నాయని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటుంది. అంతే కాదు కేవలం భారత్ కోసమే వాటిని దాచి ఉంచామని చెబుతుంది. భారత్ మీద అలా తన పగను చాటుకుంటుంది. అయితే పాక్ వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయంటే దానికి తలో రకమైన జవాబు వస్తుంది.

మరో విషయం ఏమిటి అంటే పాక్ అణ్వాయుధాల గుట్టు ఏంటో వాటి సత్తా ఏంటో కూడా చాలా మందికి తెలుసు అంటున్నారు. పాక్ భారత్ ల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగి పెద్దవి అయ్యాయి. అవి యుద్ధం దాకా దారి తీసేలా సీన్ ఉంది. పాక్ ప్రధాని అయితే అణు ఆయుధాల విషయంలో ఆరా తీసారు అన్న ప్రచారం సాగింది.

ఈ నేపధ్యంలో సరికొత్త చర్చ వస్తోంది. అసలు పాక్ కి అణ్వాయుధాలను ఎలా వాడాలో తెలియదు అని. నిజానికి అణ్వాయుధాలు ఉంటే సరిపోదు, వాటిని చాలా చక్కగా ఆపరేషన్ చేయాలి. సరైన విధంగా టార్గెట్ చేయాలి. లేకపోతే ఉన్న కొంపకే నిప్పు అంటుకుంటుంది. లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.

అంతా ఒక విధమైన సామర్ధ్యంతో చేయాల్సిన పని. ఇక అణు ఆయుధాలు అంటే అగ్గి పుల్ల కాదు ఇలా గీసి అలా విసిరేయడానికి, వాటిని ప్రయోగించడానికి ఒక ఎక్సర్ సైజ్ ఉంటుంది. కొంత వ్యవధి కూడా పడుతుంది. ఈ క్రమంలో పాక్ కి అణు ఆయుధాలు ఎలా వాడాలో తెలియదని సరిగ్గా లక్ష్యాలను గురి చూసి ప్రయోగించే సత్తా లేదని దౌత్య నిపుణులు అంటున్నారు. ఏదో తన వద్ద అణు ఆయుధాలు ఉన్నాయని చెప్పుకోవడానికి చిన్న పిల్లల మాదిరిగా సంబరపడడానికే పాక్ ఇలా చేస్తోంది అని అంటున్నారు.

ఇక ఎయిర్ సర్జికల్స్ చేసిన భారత దళాలు పాక్ లోని అన్ని మూలల్లోకి వెళ్ళి మరీ బాంబు దాడులు చేశారు. మరి కొద్ది దూరంలో పాక్ అణు ఆయుధ భాండాగారం ఉంది అనగా ఆ దగ్గరలో కూడా ఇండియన్ ఎయిర్ సర్జికల్స్ జరిగాయట. దాంతో తత్తరపాటుతో బిత్తరపోవడం పాక్ వంతు అయింది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక పాక్ కి మూర్ఖత్వం మొండితనం తప్ప మరేమీ తెలియవని అంటున్నారు.

సో పాక్ అణు ఆయుధాలు అని ఒకసారి వాటిని టచ్ చేసేలోగా పాక్ భరతం పట్టే పూర్తి సామర్థ్యం ఇండియాకు ఉంది అని అంటున్నారు. ఒక విధంగా ఇది భారత్ కి ఊరటను ఇచ్చే విషయమే. పిచ్చోడు చేతిలో రాయి మాదిరిగా ఉన్న పాక్ లో అణు ఆయుధాలు కనుక కరెక్ట్ గా ఆపరేట్ చేసే సత్తా ఉంటే అది ఏదో నాటికి ఇబ్బందే అవుతుంది అని అంటున్నారు. రానున్న రోజులలో భారత్ గురి అంతా పాక్ లోకి సరైన ప్రాంతాలలో పెట్టి మరీ దాయాది పీచమణచాలని అంతా కోరుకుంటున్నారు.