గడువు ముగిసిన తర్వాత భారత్ లో ఉండే పాకిస్తానీలకు ఏం జరుగుతుంది?
సార్క్ వీసాల కింద భారత్ లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోపు (ఇప్పటికే ఆ గడువు ముగిసింది) దేశాన్ని వీడాలని.. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువు ఉంది.
By: Tupaki Desk | 28 April 2025 10:06 AM ISTపహల్గాం ఉగ్రఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన పలు చర్యల్లో ఒకటి దేశంలోని పాకిస్తానీయులు భారతదేశాన్ని విడిచి పెట్టి వెళ్లాలని. వీసాలకు అనుగుణంగా టైం లైన్ ఇచ్చి మరీ వారు వెళ్లిపోవాలని ఆదేశించారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి.. గడువు ముగిసిన తర్వాత కూడా భారత్ లో ఉండే పాకిస్తానీయులను ఏం చేస్తారు? అన్న ప్రశ్న రాక మానదు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీయుల వివరాల్ని వెల్లడించి.. వారిని గుర్తించి వెనక్కి పంపే ఏర్పాట్లు చేయాలని కోరటం తెలిసిందే.
సార్క్ వీసాల కింద భారత్ లో ఉన్న పాకిస్థానీయులు ఏప్రిల్ 26లోపు (ఇప్పటికే ఆ గడువు ముగిసింది) దేశాన్ని వీడాలని.. వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల 29 వరకు గడువు ఉంది. బిజినెస్.. విజిటర్.. స్టూడెంట్ తదితర 12 విభాగాల్లో వీసాలు ఉన్న వారు ఏప్రిల్ 27 నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ గడువు నిన్నటితోముగిసింది. దీంతో.. వైద్యం కోసం వచ్చే వారి గడువు రేపటి(మంగళవారం)తో ముగియనుంది.
నిబంధనల పరకారం గడువు తీరిన తర్వాత కూడా భారతదేశంలో ఉండటం వీసా నిబంధనల్ని ఉల్లంఘించటమే అవుతుంది. ఇలాంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకొని అదుపులోకి తీసుకొని అరెస్టు చేయొచ్చు. వారిపై విచారణ చేపట్టి మూడేళ్లు జైలుశిక్ష.. రూ.3 లక్షలు ఫైన్ విధించొచ్చు. ఈ రెండింటిని కూడా విధించే వీలుంది. తాజా పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ జాతీయులు అటారీ - వాఘా సరిహద్దు నుంచి మూడు రోుల్లో 509 మంది వెళ్లిపోయారు. పాకిస్తాన్ లో ఉన్న 745 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు.
