పాక్ మీడియా బరితెగింపు.. ట్రంప్ వ్యాఖ్యల్లోనూ సొంత పైత్యం!
భారత్ మీద నిత్యం విషం కక్కటం.. తప్పుడు వ్యాఖ్యల్ని.. వాదనల్ని పాక్ ప్రజలకు చెప్పేయటం ఎప్పటి నుంచో ఉన్నదే.
By: Tupaki Desk | 7 May 2025 9:33 AM ISTదాయాది పాక్ తీరు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది. పాలు తాగే పిల్లి తనను ఎవరూ చూడట్లేదన్నట్లుగా.. పాక్ తీరు ఉంటుంది. ప్రపంచం మొత్తం నిజాల గురించి మాట్లాడుకుంటున్న వేళ.. పాక్ మాత్రం అబద్ధాల్ని.. అసత్యాల్ని అక్షర సత్యాలుగా పేర్కొంటూ తన దేశ ప్రజలకు వార్తల రూపంలో అందించే తీరు చూస్తే.. వీరి బరితెగింపు ఎంతలా ఉంటుందన్నది అర్థమవుతుంది. భారత్ మీద నిత్యం విషం కక్కటం.. తప్పుడు వ్యాఖ్యల్ని.. వాదనల్ని పాక్ ప్రజలకు చెప్పేయటం ఎప్పటి నుంచో ఉన్నదే.
చివరకు కీలక అంశం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యను సైతం తమకు తగ్గట్లుగా మార్చుకోవటం.. తమదైన మసాలను జోడించిన తీరు చూస్తే.. వారి వైఖరి ఎంత విపరీతంగా ఉంటుందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఏ నిజాన్ని దాచలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధాల్ని.. అసత్యాల్ని మాత్రమే ప్రచారం చేయటం.. దాన్నే అధికారిక సమాచారంగా తమ దేశ ప్రజలకు వార్తల రూపంలో అందించే వైనం చూస్తే.. పాక్ ప్రజల్ని అక్కడి ప్రభుత్వం మాత్రమే కాదు.. మీడియా కూడా ఎంత మోసం చేస్తుందో అర్థమవుతుంది.
ఇదంతా ఎందుకంటే.. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన మెరుపుదాడుల గురించి ఇప్పటికే తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టేసిన పాక్ మీడియా.. ఈ మెరుపు దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్షన్ ను సైతం తనకు తగ్గట్లుగా మార్చేసుకోవటం.. దాన్నే వార్తలుగా ఇవ్వటం చూస్తే.. వారి బరితెగింపు ఎంతలా ఉంటుందో అర్థమవుతుంది.
పాక్ మీడియా బాధ్యతారాహిత్య ధోరణిని మీకు కళ్లకు కట్టినట్లుగా చెప్పదలచాం. అందుకు.. మేం మా పైత్యాన్ని ప్రదర్శించటం లేదు. కేవలం.. వాస్తవాల్ని మాత్రమే మీ ముందు ఉంచుతున్నాం. అప్పుడు మీకు అసలు నిజాలు ఏమిటో అర్థమవుతుంది. మెరుపుదాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందనను పాక్ ప్రముఖ మీడియా సంస్థ ‘డాన్’ తన వెబ్ సైట్ లో ప్రచురించిన ఉర్దూ వార్తను.. తెలుగులోకి గూగుల్ అనువాదంతో ఇస్తున్నాం. అదే సమయంలో.. అమెరికాకు చెందిన ప్రముఖ వెబ్ సైట్.. రాయిటర్స్ వార్తాకథనంలో ట్రంప్ వ్యాఖ్యల్ని ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘At the White House, President Trump called the escalation between India and Pakistan “a shame.”
“We just heard about it,” he said of the Indian strikes. “They’ve been fighting for a long time. I just hope it ends very quickly.”
దీన్ని తెలుగులోకి అనువదిస్తే.. (దీనికి గూగుల్ సాయం తీసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది)
‘‘వైట్ హౌస్ వద్ద, అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత "సిగ్గుచేటు" అని అభివర్ణించారు’’
"మేము దాని గురించి ఇప్పుడే విన్నాము," అని ఆయన భారత దాడుల గురించి అన్నారు. "వారు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఇది చాలా త్వరగా ముగియాలని నేను ఆశిస్తున్నాను."
ఇదిలా ఉంటే.. ట్రంప్ వ్యాఖ్యాల్ని మన దేశానికి చెందిన ప్రముఖ మీడియా సంస్థలు ఎలా ఇచ్చాయో చూస్తే..
‘‘పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా.. పాక్ పరిస్థితి దారుణంగా ఉంది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచన చేశారు. ‘ఇది చాలా హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి’’ అని పేర్కొన్నారు.
భారత మెరుపు దాడులపై ట్రంప్ స్పందనను అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ.. పాక్ కు చెందిన మీడియా సంస్థతో పాటు.. భారత్ కు చెందిన మీడియా సంస్థలు ఎలా రియాక్టు అయ్యోరో చూస్తే.. ఎవరు వాస్తవానికి దగ్గరగా.. వాస్తవాలను మాత్రమే తమ ప్రజలకు చెబుతున్నారో ఇట్టే అర్థమవుతుంది.
