Begin typing your search above and press return to search.

మరోసారి పాక్ తో టర్కీ ఆర్మీ.. భారత్ నెక్ట్స్ స్టెప్ ఇదేనా..?

కానీ భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని నాశనం చేసింది. వీటితో పాటు ఆయా దేశాలకు చెందిన సైనికులు కూడా పాకిస్తాన్ కు సాయం చేశారు.

By:  Tupaki Desk   |   15 Aug 2025 5:00 AM IST
మరోసారి పాక్ తో టర్కీ ఆర్మీ.. భారత్ నెక్ట్స్ స్టెప్ ఇదేనా..?
X

పహెల్గాంలో ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టిందని అందరికీ తెలిసిందే కదా.. యుద్ధం అనంతరం ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆన్ లోనే ఉందని, ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా.. అది యుద్ధంగానే మేము భావిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ప్రపంచానికి చెప్పారు కూడా. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ సాయం చేసింది. ఆ దేశానికి చెందిన డ్రోన్లు, క్షిపణులు పాకిస్తాన్ నుంచి భారత్ భూభాగంలోకి చొచ్చుకొని వచ్చాయి. కానీ భారత్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని నాశనం చేసింది. వీటితో పాటు ఆయా దేశాలకు చెందిన సైనికులు కూడా పాకిస్తాన్ కు సాయం చేశారు.

పాక్ ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్

భారత్ కు స్వాతంత్రం వచ్చిన సరిగ్గా ఏడాది తర్వాత పాక్ భారత్ నుంచి విడిపోయింది. అంటే మనం 79వ స్వాతంత్రం దినోత్సవాన్ని ఆగస్టు 15న నిర్వహించుకుంటే పాక్ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆగస్ట్ 14న నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురువారం నిర్వహించింది. ఈ వేడుకలు జిన్నా స్టేడియంలో జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్ లో టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు చెందిన ఆర్మీ పాల్గొంది. భారత్ ను కవ్వించేందుకు రెండు దేశాలు పాకిస్తాన్ తో జతకట్టాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీకి చెందిన వస్తువులపై భారత్ నిషేధం విధించింది. విమానాశ్రయంలో కీలకంగా పని చేస్తున్న ఎజెన్సీని కూడా భారత్ రద్దు చేసింది.

షెహబాజ్ షరీఫ్ హాస్యాస్పద వ్యాఖ్యలు..

పాక్ స్వాతంత్ర వేడుకల్లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్ లో ‘ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్’ను ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాక్ సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న పాకిస్తాన్ ఈ సారి సైన్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధాని ప్రసంగం సాగింది. పైగా ఆపరేషన్ సింధూర్ ను నాలుగు రోజుల్లో ముగించామని, తమ సైతం భారత్ ను కట్టడి చేసిందని, తమ దెబ్బకు భారత్ అల్లాడిపోయిందని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు.