Begin typing your search above and press return to search.

వీడే.. పాక్ ఫేక్ న్యూస్ క్రియేటర్.. వీడి బ్యాగ్రౌండ్ ఇదే

ఒకే ఒక్క పేరు పాక్ ఇంటరర్ సర్వీసెస్ పబ్లిక్ రిటేషన్స్ డైరెక్టర్ జనరల్ కం లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురిగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   11 May 2025 10:09 AM IST
వీడే.. పాక్ ఫేక్ న్యూస్ క్రియేటర్.. వీడి బ్యాగ్రౌండ్ ఇదే
X

చరిత్రలో ఇప్పటివరకు భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధాలకు భిన్నంగా తాజా ఉద్రిక్తతలు ఉన్నాయని చెప్పాలి. దీన్ని యుద్ధంగానే చూస్తామని పాకిస్తాన్ అంటుంటే..భారత్ మాత్రం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంగా చెబుతోంది. ఇందుకు తగ్గట్లే.. దాయాది ఎంతలా రెచ్చగొడుతున్నా.. అంతులేని సంయమనాన్ని పాటిస్తూ.. సాధారణ ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా.. పరిమిత లక్ష్యాల్ని చేధించేలా దాడులు చేస్తుండటం తెలిసిందే.

ఉగ్రస్థావరాలు.. భారత్ పై దాడులకు తెగపడే లక్ష్యాల్ని మాత్రమే టార్గెట్ చేయటం కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో అత్యంత కీలకమైనది పాకిస్తాన్ చేపట్టిన ఫేక్ న్యూస్ వార్. తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ప్రపంచం మొత్తం తన ఫేక్ న్యూస్ ట్రాప్ లో పడేలా చేయటంలో పాక్ విజయవంతమైంది. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలు సైతం పాక్ క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ బాధితులే.

ఇంతకూ ఈ ఫేక్ న్యూస్ వార్ చేస్తున్నోడు ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏమిటి? పాక్ చేపట్టిన గ్లోబల్ ప్రచారానికి సారథిగా ఉన్నదెవరు. లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే వినిపించే ఒకే ఒక్క పేరు పాక్ ఇంటరర్ సర్వీసెస్ పబ్లిక్ రిటేషన్స్ డైరెక్టర్ జనరల్ కం లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురిగా చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడి మొదలు భారత్ పై వ్యూహాత్మకంగా తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త.. కర్మ.. క్రియ ఇతడే.

ఇతడి మూలాల్ని చూస్తే..అతడో ఉగ్రవాది కొడుకు. భారత్ మీద నిత్యం విషం చిమ్మటం అతడి నైజం. చౌధరి తండ్రి సుల్తాన్ బహీరుద్దీన్ మెహమూద్ ఒక అణు శాస్త్రవేత్త. పాక్ అణ్వాయుధ పిత అబ్డుల్ ఖదీర్ ఖాన్ తో కలిసి అణుబాంబు తయారీలో కీలక భూమిక పోషించాడు. యురేనియం శుద్ది తదితర అంశాల్లో చురుగ్గా వ్యవహరించిన ఇతను.. అందుకు సంబంధించిన కీలక సమాచారమైన గ్యాస్ సెంట్రిప్యూజ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ నుంచి దొంగలించాడు.

పేరుకు అణుశాస్త్రవేత్త అయినప్పటికీ అతడో కరుడుగట్టిన మతోన్మాది కం పేరుమోసిన ఉగ్రవాది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న వారిలో ఇతడు ఒకడు. పాక్ అణ్వాయుధ టెక్నాలజీని దాదాపుగా అల్ కాయిదా లాంటి ఉగ్రవాద సంస్థ చేతిలో పెట్టిన దరిద్రుడు. అప్పటి బిన్ లాడెన్ కు అత్యంత సన్నిహితుడు. ఇతడి నిర్వాకం ప్రాశ్చత్య దేశాలకు సైతం పెద్ద సమస్యగా మారింది.

అలాంటి ఉగ్రవాది కొడుకే ఈ చౌధురి. భారత్ తో జరుగుతున్న సంఘర్ణణను తప్పుడు సమాచారాన్ని ప్రపంచ దేశాలకు అందిస్తున్నాడు. తమది ఉగ్రవాద బాధిత దేశంగా మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేకాదు.. ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ భారత్ మీద ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నాడు. భారత సైన్యం చేతిలో నిత్యం చావుదెబ్బలు తింటున్నా.. అతను మాత్రం వాస్తవాల్ని పూర్తిగా కప్పిపుచ్చేసి.. గొప్పలకు పోతున్నాడు. ఈ విషయాన్ని పాక్ ప్రజలే చెబుతూ.. తిట్టుకుంటున్నారు. ఇంత అరాచకంగా ఉంటుంది.. పాక్ ఫేక్ న్యూస్ క్రియేటర్ నేపథ్యం.