ఎఫ్-16 కూల్చిన భారత్... అమెరికాకు అడ్డంగా దొరికేసిన పాక్!
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ పై పాక్ దాడులకు తెగబడుతోంది.
By: Tupaki Desk | 9 May 2025 4:04 AMభారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న వేళ.. ఇరు దేశాల మధ్య సమస్యలు త్వరగా సమిసిపోవాలని.. ఇరు దేశాల మధ్య తాము మధ్యవర్తిత్వం చేస్తామని అమెరికా చెబుతున్న వేళ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఎఫ్-16 యుద్ధ విమానం విషయంలో అమెరికాతో ఉన్న అగ్రిమెంట్ ను పాక్ ఉల్లంఘించింది!
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ పై పాక్ దాడులకు తెగబడుతోంది. ఈ సమయంలో తాజాగా జమ్మూ లక్ష్యంగా పలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. అయితే.. వాటిని భారత్ విఫలం చేసింది. ఇదే సమయంలో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా పాక్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది.. దీన్ని భారత్ అడ్డగించి నాశనం చేసింది.
ఇదే సమయంలో పఠాన్ కోట్ సెక్టార్ లో పాకిస్థాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లను సైన్యం కూల్చి వేసింది. ఇందులో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంది. ఈ సమయంలో ఆ జెట్ లోని పైలట్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్-16 విషయంలో అగ్రరాజ్యం అమెరికాకు పాకిస్థాన్ అడ్డంగా దొరికేసిందని అంటున్నారు. దానికి పెద్ద కారణమే ఉంది.
వాస్తవానికి 1980 చివర్లో అమెరికా తయారు చేసిన ఎఫ్-16 యుద్ధ విమానలను పాకిస్థాన్ అందుకుంది. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య వీటి వాడకంపై అగ్రిమెంట్ జరిగింది! ఇందులో భాగంగా.. ఉగ్రవాద నిరోధక, తిరుగుబాటు నిరోధక కార్యకలాపాల కోసం మాత్రమే ఈ ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించాలని అమెరికా కండిషన్ పెట్టింది.
ఇదే సమయంలో... పాకిస్థాన్ వెలుపల ఎఫ్-16 విమానాలు లేదా మూడో దేశంతో ఉమ్మడి కార్యకలాపాల్లో పాల్గొనడానికి వాడాల్సి వస్తే అందుకు యూఎస్ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరమని కండిషన్ పెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే... ఈ విషయంలో ఉన్న అన్ని కండిషన్స్ ను పాక్ ఉల్లంఘించి, భారత్ పై దాడికి యత్నించింది!
వాస్తవానికి ఈ ఎఫ్-16 కండిషన్స్ ని పాక్ 2019లోనే ఉల్లంఘించింది. అయితే.. నాడు దాడి చేసి తప్పించుకుంది! అయితే... ఈ సారి మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికేసింది. ఆ జెట్ నడిపిన పైలట్ కూడా దొరికేసిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది.. పాక్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.