Begin typing your search above and press return to search.

పాక్ కౌంటర్ ఎటాక్.. భారత నౌకలకు తమ ఓడరేవుల్లో నో ఎంట్రీ!

ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నందుకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా వచ్చే దిగుమతులపై బ్యాన్ విధిస్తూ భారత్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 May 2025 3:00 PM IST
Ports, Airspace, and Parcels Blocked
X

ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్నందుకు పాకిస్తాన్ నుంచి డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా వచ్చే దిగుమతులపై బ్యాన్ విధిస్తూ భారత్ ఆర్డర్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ రివర్స్ గేర్ వేసింది. భారత జెండా ఉన్న నౌకలు తమ పోర్టులను ఉపయోగించుకోవడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాదు, భారత్ నుంచి దిగుమతి చేసుకునే కొన్ని వస్తువులపై కూడా బ్యాన్ చేస్తున్నట్లు చెప్పింది. పాక్ నౌకలు కూడా ఇండియాలోని పోర్టులకు వెళ్లడానికి వీల్లేదని అక్కడి పెద్ద అధికారులు రూల్స్ పెట్టారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న టెన్షన్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

పాకిస్తాన్‌పై మరిన్ని ఆంక్షలు

పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతుల మీద బ్యాన్ విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే అన్ని రకాల ప్రోడక్ట్స్‌కు ఈ బ్యాన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్ క్లోజ్ చేసింది. ఆ దేశ జెండాతో ఉన్న షిప్స్ ఇండియన్ పోర్టుల్లోకి రాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రూల్స్ వెంటనే అమల్లోకి వస్తాయని చెప్పింది. అటు ఇండియన్ షిప్స్ కూడా పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్లకూడదని తేల్చి చెప్పేసింది. ఇదివరకే పాకిస్తాన్ ఫ్లైట్స్‌కు మన ఎయిర్‌స్పేస్‌ను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆ దేశం నుంచి ఇండియాకు వేర్వేరు మార్గాల్లో వచ్చే అన్ని రకాల లెటర్స్, పార్సిల్స్ రవాణాను కూడా ఆపేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ అనౌన్స్ చేసింది.

2019లో పుల్వామా టెర్రరిస్ట్ అటాక్ తర్వాత పాకిస్తాన్ దిగుమతులపై 200శాతం ట్యాక్స్ వేసింది సెంట్రల్ గవర్నమెంట్. దాంతో అవి చాలా వరకు తగ్గిపోయాయి. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్, బోర్డర్‌లో కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇప్పుడు ఇతర దేశాల ద్వారా పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులను కూడా ఆపేసింది. దీంతో ఇండియాకు ఎక్స్‌పోర్ట్స్‌పైనే ఆధారపడుతున్న పాకిస్తాన్‌లోని కొన్ని ఇండస్ట్రీలపై బాగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉండడంతో ఆ దేశం రివర్స్ యాక్షన్ తీసుకుంటోంది.