ప్రపంచ సందేహం : పాక్ బతికి బట్టకడుతుందా ?
అసలే అప్పులతో ఈడుస్తున్న దేశానికి భారత్ తో యుద్ధం అవసరమా అంటే ముర్కత్వం నెత్తికెక్కి దేశాన్ని ఉగ్ర మూకల చేతిలో పెట్టాక ఇక ఏమి చేసినా లాభం లేదు అన్నదే అంతా అంటున్న మాట
By: Tupaki Desk | 10 May 2025 2:00 AM ISTఇపుడు ఉన్నా పరిస్థితుల్లో పాకిస్థాన్ అత్యంత దారుణంగా ఉంది. అసలే అప్పులతో ఈడుస్తున్న దేశానికి భారత్ తో యుద్ధం అవసరమా అంటే ముర్కత్వం నెత్తికెక్కి దేశాన్ని ఉగ్ర మూకల చేతిలో పెట్టాక ఇక ఏమి చేసినా లాభం లేదు అన్నదే అంతా అంటున్న మాట. పాకిస్థాన్ లో దయనీయ పరిస్థితికి నవ్వాలో ఏడావలో ఎవరికీ అర్థం కావడం లేదు.
నట్టింట పుట్టెడు సమస్యలు పెట్టుకుని భారత్ వంటి బడా దేశాన్ని సవాల్ చేస్తూ తొడ కొట్టడం అంటే అది పిచ్చి అయినా అయి ఉండాలి లేదా ఉన్మాదం అయినా ఉండాలి. పాక్ మరి ఏ విధంగా ఆలోచించుకుందో తెలియదు. అసలు పాక్ లో ఆలోచించుకునే ప్రభుత్వం ఉందా అన్నది ఒక డౌట్.
ఎందుకంటే అక్కడ ప్రధాని మంత్రులు కేబినెట్ అంతా బొమ్మలే. వెనకాల ఆడిస్తోంది సైన్యం అని చెబుతారు. అంతే కాదు ఆ సైన్యం ఉగ్ర మూకలకు ప్రోత్సాహం అందిస్తూ పైశాచిక ఆనందం అనుభవిస్తూ ఉంటుంది. ఇక అప్పులు చేసి మనుగడ సాగిస్తూ పాక్ అలవాటుగా మార్చుకుంది.
అలా వచ్చిన నిధులను ప్రజల కోసం కాకుండా ఆర్మీ ప్రభుత్వ పెద్దలు తమ విలాసాలకు వాడుకుంటూ ధిలాసా చేస్తూంటారు అని అంటారు. ఇలా పాకిస్థాన్ లోగుట్టు ఉంది. ప్రజలు అలో లక్షణా అని ఆకలితో అలమటిస్తున్నారు. భారత్ తో తీరి కూర్చుని పెట్టుకున్న పాపానికి సింధు నది జలాలు పోయాయి. దాంతో సగం పాకిస్థాన్ గొంతు ఎండిపోతోంది.
మరో వైపు చూస్తే పాకిస్థాన్ ని అన్ని విధాలుగా ఆర్ధికంగా నష్టపరిచే నిర్ణయాలను భారత్ తీసుకుంది. ఇది చాలదన్నట్లుగా యుద్ధానికి పాక్ కవ్విస్తూంటే కుమ్మి పారేస్తోంది దాంతో ఏమి చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పాక్ అల్లాడిపోతోంది.
అసలు పాక్ అన్నది ఒక దేశంగా ఒక వ్యూహంతో భారత్ మీద యుద్ధం చేస్తొందా లేక ఉగ్ర మూకలతో భారత్ తలపడుతోందా అన్నదే అందరికీ కలిగే డౌట్ గా ఉంది. ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, దేశం మీదకు ఆగ్రహంగా భారత్ దండెత్తి వస్తున్న వేళ పాక్ పార్లమెంట్ లో ఎంపీలు తమ సొంత పాలనను ప్రభుత్వాన్ని తిడుతున్నారు అంటేనే పాక్ ఎంతలా దివాళా తీసిందో అర్ధం అవుతోంది.
ఇక పాకిస్థాన్ మీదకు భారత్ వెళ్ళి యుద్ధం చేయడాన్ని ప్రపమమంతా చూస్తోంది. ఇది కరెక్టే అన్న వారు ఎక్కువ. మరో వైపు చూస్తే భారత్ ధర్మాగ్రహానికి పాక్ ఏమవుతుందో కూడా అంతర్జాతీయ సమాజానికి అతి పెద్ద
డౌట్ వస్తోంది. అయినా భారత్ కి చెప్పగలిగే స్థితిలో కానీ చొరవ తీసుకునే వాతావరణంలో కానీ ఏ దేశమూ లేకపొవడం విడ్డూరం. ఇదే పాక్ పాలిట పెను శాపంగా మారుతోంది. పాక్ తనకు అండగా ఉంటారు అనుకున్న దేశాలు కూడా భారత్ ధాటిని ఆ దేశ యుద్ధ నైపుణ్యాన్ని వ్యూహాలను చూసి పాక్ పని అయిపోయినట్లే అని తేల్చేస్తున్నారు.
ఆపరేషన్ సింధు అంటూ మొదలెట్టిన ఈ యుద్ధం ఇప్పట్లో అంతం కాదు అన్నది అంతా అంటున్న మాట. ఈ సమరం దీర్ఘ కాలం దశల వారీగా జరుగుతుంది అని అంటున్నారు. ఇక యుద్ధం ముగిసాక క పాక్ అన్నది ఈ తీరున ఈ రూపున ఉంటుందా లేక ముక్క చెక్కలు అవుతుందా అన్నది కూడా ఎవరికీ బోధపడటం లేదు. మొత్తానికి చూస్తే కనుక భారత్ తో పెట్టుకుని పాక్ తప్పు చేసింది అన్నదే అంతా అంటున్న మాట. ఇక ఎన్నడూ లేనటువంటి అనుకూల వాతావరణం ఇంటా బయటా కలసి రావడంతో భారత్ మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా దాయాది మీద విరుచుకుపడుతోంది. ఈ దెబ్బతో పాక్ రాక్షస సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భారత్ కంకణం కట్టుకుంది అని అంటున్నారు సో పాక్ అన్ని తట్టుకుని బతికి బట్ట కడుతుందా అంటే ఏమో అనే జవాబు వస్తోంది.
