కాల్పుల విరమణ వేళ పాక్ ఉల్లంఘనలు ట్రంప్ కంటికి కనిపించవా?
అయితే.. ఈ దాడులకు సమాధానంగా భారత్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే.. తాను ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి.
By: Tupaki Desk | 13 May 2025 11:57 AM ISTపహల్గాం ఉగ్రదాడి.. అనంతరం జరిగిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పెరిగిన ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు వీలుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోవటం తెలిసిందే. ఈ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రితో పాటు.. సోమవారం రాత్రి కూడా పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడటం తెలిసిందే. ఓవైపు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటామని చెబుతూనే మరోవైపు ఈ తరహాలో దొంగ దెబ్బలు తీయటం పాకిస్తాన్ కు అలవాటుగా మారింది.
అంచనాలకు మించి జరిగిన నష్టంతో కుతకుతలాడిపోతున్న పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అదే పనిగా ఉల్లంఘిస్తోంది. అయితే.. ఉద్రికత్తలు మరింత పెరగకుండా ఉండేందుకు భారత్ సంయమనంతో వ్యవహరిస్తూ.. పాక్ కాల్పుల్ని.. దాడుల్ని సమర్తంగా తిప్పికొడుతోంది. అయితే.. ఈ దాడులకు సమాధానంగా భారత్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే.. తాను ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంటే.. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న పరిస్థితి.
ఇదిలా ఉంటే.. పాక్ తప్పుడు విధానాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడరా? అని ప్రశ్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన అంశానికి తానే మధ్యవర్తిత్వాన్ని వహించినట్లుగా ట్రంప్ నేరుగా ప్రకటించటం తెలిసిందే. అలాంటి వేళలో.. పాక్ తప్పుడు పద్దతుల్ని ప్రశ్నించాల్సిన అవసరం ట్రంప్ మీద ఉంది. తాను మధ్యవర్తిత్వం వహించింది కాసేపు నిజమే అనుకుందాం. అలాంటి వేళలోనూ.. బాధ్యతతో కాల్పుల విరమణ నిర్ణయాన్ని గౌరవిస్తూ భారత్ ఉండిపోతే..పాక్ మాత్రం అందుకు భిన్నంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.
ఇలాంటి తీరుకు చెక్ పెట్టాల్సన బాధ్యత ట్రంప్ మీదనే ఉంటుంది. మైలేజీ కోసం తపించే ట్రంప్.. తాను స్వయంగా మధ్యవర్తిత్వం ()ట్రంప్ వెర్షన్ ప్రకారం వహించిన అంశంలో పాక్ తన మాటకు భిన్నంగా వ్యవహరిస్తున్న దాయాది విషయంలో కఠినంగా వ్యవహరించటమే కాదు.. ఘాటు హెచ్చరిక జారీ చేయాలి. వీటన్నింటితో పాటు పాక్ ను కంట్రోల్ చేసే విషయం మీద అమెరికా అధ్యక్షుడు మరింత పోకస్ పెంచాల్సిన అవసం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.
