Begin typing your search above and press return to search.

బిచ్చగాళ్ల ప్యాక్టరీగా పాకిస్తాన్.. ప్రపంచానికి సప్లై చేస్తూ అడ్డంగా బుక్కైంది

ఈ పాకిస్తానీయులు వేరు వేరు వీసా పర్మిట్ల మీద సౌదీ అరేబియాకు వెళ్లారు. కానీ అక్కడ పని చేసేందుకు బదులుగా అడుక్కోవడం మొదలు పెట్టారు.

By:  Tupaki Desk   |   21 April 2025 3:15 PM IST
Pakistan Embarrassed as Over 4,700 Beggars Deported from Saudi Arabia
X

మరోసారి పాకిస్తాన్ తన పరువు పోగొట్టుకుంది. ఈ సారి పరువు తీసింది మాత్రం ఎవరో కాదు.. సాక్షాత్తూ ఆ దేశ పౌరులే. పాక్ ప్రభుత్వం అప్పుడప్పుడు ఐఎంఎఫ్, అరబ్ దేశాల తలుపు తడుతూ ఆర్థిక సాయం చేయాలంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. ప్రభుత్వమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా విదేశాల్లో అడుక్కోవడాన్నిఒక లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నారు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియా 4700మందికి పైగా పాకిస్తాన్ బిచ్చగాళ్లను అరెస్ట్ చేసి తమ దేశానికి తిప్పి పంపింది.

ఈ పాకిస్తానీయులు వేరు వేరు వీసా పర్మిట్ల మీద సౌదీ అరేబియాకు వెళ్లారు. కానీ అక్కడ పని చేసేందుకు బదులుగా అడుక్కోవడం మొదలు పెట్టారు. రోజు రోజుకు పెరుగుతున్న ఈ బిచ్చగాళ్ల సంఖ్యతో సౌదీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వారు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో దాదాపు 5 వేల మంది బిచ్చగాళ్లు పట్టుబడ్డారు.

పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక డాన్ కథనం ప్రకారం.. మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో దాదాపు రెండు కోట్ల మందికి పైగా బిచ్చగాళ్లు ఉన్నారని, వీరు ప్రతేడాది 42 బిలియన్ రూపాయలను బిక్ష రూపంలో సంపాదిస్తున్నారని తెలిపారు. అయితే విదేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్ల సంఖ్య నిత్యం పెరుగుతుండడం దేశ ప్రతిష్టను దిగజారుస్తోంది.

మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. 2035 నాటికి పాకిస్తాన్‌ను 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. ఇతర దేశాల్లో అడుక్కుంటున్న తమ దేశ పౌరులు పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారారు. ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ ప్రతిష్ట దిగజారుతోంది. దీనిని తగ్గించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో విదేశాల్లో బిచ్చగాళ్లుగా మారిన వేలాది మంది పాస్ పోర్టులను రద్దు చేసింది.

మరీ ముఖ్యంగా అరబ్ దేశాల్లో పట్టుబడిన చాలా మంది బిచ్చగాళ్లు పాకిస్తాన్ మూలానికి చెందిన వారు. దీని ఫలితంగా సౌదీ అరేబియా దేశాలు బిచ్చగాళ్ల రాకను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని పాక్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి.