ఉగ్రదాడిలో ‘మతం’... షాకింగ్ విషయాలు చెప్పిన బాలుడు!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 April 2025 6:14 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో చిన్న పిల్లలున్న తండ్రులు, కొత్తగా పెళ్లైన వారు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సందర్భంగా కాల్పులకు ముందు ఉగ్రవాదులు అందరినీ వారి వారి మతాల గురించి అడిగారనే విషయంపై ఓ బాలుడు క్లారిటీ ఇచ్చాడు.
అవును... పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపే ముందు.. వారి వారి మతాల గురించి ఆరా తీశారనే విషయం ఇప్పటికే పలువురు బాధితుల కుటుంబ సభ్యులు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన సూరత్ కు చెందిన శైలేష్ కల్దియా కుమారుడు పలు కీలక విషయాలు వెల్లడించాడు.
ఇందులో భాగంగా... తాము మినీ స్విట్జర్లాండ్ అయిన పహల్గాం కు వెళ్లామని చెప్పాడు. అయితే.. రోడ్డు వాహనాలకు వీలు కాకపోవడంతో గుర్రలపై స్వారీ చేయాల్సి వచ్చిందని.. తాము అక్కడికి చేరుకోగానే ఆకలైపోయిందని.. ఈ సమయంలో అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్ధం వినిపించిందని.. ఆ శబ్ధం వినగానే అంతా అక్కడి నుంచి పారిపోయామని తెలిపాడు.
ఆ సమయంలో.. ఉగ్రవాదులు తమ ముందుకు వచ్చారని.. అక్కడున్న పర్యాటకులను హిందువులు, ముస్లింలుగా విడిపోవాలని అన్నారని.. అనంతరం హిందువులు అందరినీ కాల్చి చంపారని.. అనంతరం వారు అదృశ్యమయ్యారని.. ఉగ్రవాదుల్లో ఓ వ్యక్తి పెద్ద గడ్డం, తలపై టోపీ, కెమెరా ధరించాడని తెలిపాడు.
