Begin typing your search above and press return to search.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయా ?

దేశంలో అతి పెద్ద సంఘటంగా పహిల్గాం ఉగ్రదాడి జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అంశగా మారింది.

By:  Tupaki Desk   |   4 Jun 2025 6:00 PM IST
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయా ?
X

దేశంలో అతి పెద్ద సంఘటంగా పహిల్గాం ఉగ్రదాడి జరిగింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద అంశగా మారింది. ఈ దుర్ఘటనలో ఏకంగా ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. దాంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ ని నిర్వహించి పాకిస్తాన్ మీద ఎయిర్ సర్జికల్స్ చేపట్టింది.

అంతవరకూ బాగానే ఉన్నా మూడు రోజుల దాడుల తరువాత ఒక్కసారిగా నిలుపు చేయడం కాల్పుల విరమణను ప్రకటించడంతో కేంద్రానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. పాకిస్థాన్ భరతం పడతారని కేంద్రానికి మద్దతు ఇస్తే అమెరికా జోక్యంతో కాల్పుల విరమణను ప్రకటించడం దారుణమని విమర్శలు గుప్పించాయి.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయితే ట్రంప్ నుంచి ఫోన్ కాల్ రాగానే కేంద్రం కాల్పుల విరమణ ప్రకటించిందని ఎద్దేవా చేశారు. జీ హుజూర్ అయ్యారు, సరెండర్ అయ్యారు అని నిప్పులు చెరిగారు. అసలు పహిల్గాం దాడి తరువాత ఆపరేషన్ సిందూర్ తరువాత వరసగా జరిగిన పరిణామాల మీద చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ మేరకు తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కోరుతూ ఇండియా కూటమి కేంద్రానికి లేఖ రాసింది. మొత్తం పదహారు పార్టీలకు చెందిన నాయకులు ఈ లేఖ పైన సంతకాలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వల్ల పాక్ కి నష్టం జరిగినా అదే స్మాయంలో సరిహద్దు ప్రాంతాలు అయిన పూంచ్‌, ఉరి, రాజౌరిలలో చోటుచేసుకున్న పాక్ దాడుల నేపధ్యంలో పౌరుల హత్యలు జరిగాయని విపక్షాలు అరోపించాయి.

ఇక భారత్ విదేశాంగ విధానం మీద తీయ భద్రత పైన కూడా కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తున్నాయి. కోట్లాదిమంది దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాలని అలాగే వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు వాస్తవాలు చెప్పాలని చీకటిలో ఎవరినీ ఉంచే ప్రయత్నం చేయరాదు అన్నదే తమ వాదన అని విపక్ష నేతలు చెబుతున్నారు.

పూర్తి సానుకూల వాతావరణంలోనే పార్లమెంట్ సమావేశాలు జరగాలని కోరారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలు సందేహాలు ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదని అంటున్నాయి. ఎవరు అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబు దారీగా ఉండాలని ఇండియా కూటమి నేతలు నొక్కి చెబుతున్నాయి.

మరో వైపు చూస్తే కేంద్రం మాత్రం ఈ డిమాండ్ ని పట్టించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది. జూలైలో ఎటూ వర్షాకాల సమావేశాలు ఉన్నందువల్ల ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించాల్సిన అవసరం లేదని అధికార ఎండీయే ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు అని అంటున్నారు. అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు విపక్షం గట్టిగా డిమాండ్ చేస్తున్న క్రమంలో ఆపరేషన్ సిందూర్ నాటి రాజకీయ ఐక్యత పూర్తిగా దూరమై మళ్ళీ ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా పాలిటిక్స్ వేడెక్కుతోంది.