Begin typing your search above and press return to search.

నవ్విపోదురుగాక పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కేటి సిగ్గు?

పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలే కారణమనే చర్చ బలంగా నడిచిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Jun 2025 1:00 AM IST
నవ్విపోదురుగాక పాకిస్థాన్  ఆర్మీ చీఫ్ కేటి సిగ్గు?
X

పహల్గాం ఉగ్రదాడికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలే కారణమనే చర్చ బలంగా నడిచిన సంగతి తెలిసిందే. ఆ ఉగ్రదాడికి ముందు కశ్మీర్‌.. పాకిస్థాన్ కు జీవనాడి అంటూ మునీర్‌ వ్యాఖ్యానించారు. ఆ తర్వాతే పహల్గాంలోని బైసరన్‌ లోయలో ఉగ్రమూక అమాయకులైన పర్యాటకుల ప్రాణలను తీసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఘర్షణకు దారి తీసింది.

ఈ దాడి భారత్ ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.. ఇదే సమయంలో ప్రతీ భారతీయుడు ప్రతీకారంతో రగిలిపోయారు. దీంతో... భారత్‌ ఆపరేషన్‌ సింధూర్‌ చేపట్టింది. దాని దెబ్బకు పాక్, పీఓకేల్లోని 9 ఉగ్రశిబిరాలతో పాటు 8 పాక్ మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి! వీటిల్లో పాక్‌ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్‌ కూడా ఉండటం గమనార్హం.

ఇలా భారత సైన్యం కొట్టిన దెబ్బలకు పాకిస్థాన్ మాడు పగిలిందని అంటారు. ఈ దెబ్బకు పాక్ ప్రధాని సేఫ్ హౌస్ లోకి వెళ్లిపోగా.. ఆర్మీ చీఫ్ అడ్రస్ లేకుండా పోయారనే కామెంట్లు నాడు వినిపించాయి. అనంతరం పాకిస్థాన్ అనధికారిక అగ్రనేత అయిన ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్.. సీజ్ ఫైర్ కోసం భారత్ ముందు మోకరిళ్లిన పరిస్థితి. అలాంటి మునీర్ ఇప్పుడు బిల్డప్ మాటలు మాట్లాడుతున్నారు.

అవును... భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నాలుగు రోజులకే వణికిపోయి, చేతులెత్తేసిన పాకిస్థాన్.. కాల్పుల విరమణకోసం న్యూఢిల్లీ ముందు మోకరిల్లింది! ఆ విషయం ప్రపంచం మొత్తానీకి తెలిసిందే! అలాంటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. ఇప్పుడు బిల్డప్ కబుర్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. పాక్ పై భారత్ కారణం లేకుండా దాడులకు పాల్పడిందని చెబుతున్నారు.

తాజాగా కరాచీలోని నేవల్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన మునీర్‌... ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్థాన్‌ కాపాడుతోందని పేర్కొన్నారు. భారత్‌ దుందుడుకు తనానికి పాక్‌ బలంగా స్పందించిందన్నారు. తమ దేశం ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పరిపక్వంగా స్పందించిందని చెప్పుకొచ్చారు.

అక్కడితో ఆగని ఆయన పైత్యం... పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్‌ మాత్రం ఉద్రిక్తతలు సృష్టిస్తోందనే విచిత్ర వ్యాఖ్యలు చేసే వరకూ వెళ్లింది! అనంతరం... భారత్ మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. దీంతో.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా మునీర్ వ్యాఖ్యాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.