Begin typing your search above and press return to search.

చందమామ మీద ఆక్సిజన్‌ ...ప్రాణం లేచొచ్చినట్లేనా...?

ఇక ఇప్పటికైతే రోవర్ కనుగొన్నది చూస్తే చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 5:50 PM GMT
చందమామ మీద  ఆక్సిజన్‌  ...ప్రాణం లేచొచ్చినట్లేనా...?
X

చందమామ మీద ఏముంది. చందన శిల్పం అంటారు కవులు. చల్లనివాడు అంటారు ప్రేమికులు. కానీ ఇపుడు చంద్రయాన్ 3 ప్రయోగంతో చంద్రుడు మీద ఏముంది అన్నది అందరికీ తెలుస్తోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 మూలంగా చంద్రుడి వద్ద ఏమున్నది అన్నది ప్రపంచంలో ఎవరు తెలుసుకోలేని సమాచారం ఇపుడు మన వద్ద ఉంది.

ఇక చంద్రుడి దక్షిణ ధృవం మీద ల్యాండ్ అయిన చంద్రయాన్ మిషన్ లోని సౌరశక్తితో నడిచే ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ అక్కడ అణువణువూ గాలిస్తున్నాయి. తమ పరిశోధనకు చందమామను పూర్తిగా వాడుకుంటున్నాయి. ఈ అధ్యయనం మరో ఏడు రోజుల పాటు సాగుతుంది. అంటే సెప్టెంబర్ 6 తేదీ దాకా అన్న మాట.

ఇదిలా ఉంటే శివ శక్తి ల్యాండింగ్ సైట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అన్వేషిస్తున్న రోవర్ తాజాగా ఏమిటి కనుగొంది అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఇక ఇప్పటికి చూస్తే రోవర్ సుమారు ఎనిమిది మీటర్ల దూరాన్ని కవర్ చేసిందని ఇస్రో అంచనా వేసింది. ఇదే క్రమంలో చందమామ మీద ఉన్న ధూళి, కంకర వంటి వాటిలో కూడా కెమికల్స్ ఏమి ఉన్నాయన్నది రోవర్ పరిశోధిస్తోంది. అంతే కాదు చంద్రుడు ఉపరితలం తో పాటు భూగర్భంలో ఏముంది. అక్కడ వాతావరణం గురించి రోవర్ పరిశోధన చేస్తోంది.

ఇక ఇప్పటికైతే రోవర్ కనుగొన్నది చూస్తే చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు గుర్తించింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అధికారికంగా ప్రకటించింది.రోవర్‌లోని లేజర్ ప్రేరిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పరికరం ఆసరాతో దక్షిణ ధృవం వద్ద చంద్రుడి ఉపరితలంలో సల్ఫర్ ఉనికిని గుర్తించిందని ఇస్రో వెల్లడించింది.

ఇక కేవలం సల్ఫర్ మాత్రమే కాదు, మరో 8 మూలకాలను కూడా రోవర్ గుర్తించినట్లు తెలిపింది. అలా కనుక చూసుకుంటే చంద్రుడి దక్షిణ ధృవం వద్ద సల్ఫర్, అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్ తో పాటుగా ఆక్సిజన్‌ కూడా ఉందని ప్రజ్ఞాన్ రోవర్ గుర్తించిందని ఇస్రో పేర్కొంది.

ఇక ఈ రోవర్ ప్రస్తుతం అక్కడ హైడ్రోజన్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఒక గ్రాఫ్‌ను ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో గల ఉష్ణోగ్రతలో ఉన్న వైవిధ్యాలను ఇస్రో వివరించింది. గ్రాఫ్ ప్రకారం లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాగా రోవర్ వద్ద ఉన్న ఈ లిబ్స్ పరికరాన్ని బెంగుళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ప్రయోగశాలలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో వెల్లడించింది.

ఏది ఏమైనా చందమామ వద్ద చాలా స్రీకేట్స్ ఉన్నాయి. వాటిని శోధించే పనిలో రోవర్ బిజీగా ఉంది. ఇప్పటికి ఏడు రోజులు గడిచాయి. మరో ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 6వ తేదీ తరువాత చంద్రుడి మీద రాత్రి మొదలవుతుంది. అది పద్నాలుగు రోజుల పాటు ఉంటుంది. మైనస్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. అప్పటికి రోవర్ సిస్టం తట్టుకుని ఉంటే ఒక అద్భుతమే అవుతుంది అని అంటున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. మళ్ళీ చంద్రుడి మీద సూర్య కాంతి ప్రసరించే టైం కి అంటే సెప్టెంబర్ 20 నాటికి రోవర్ సక్రమంగా పనిచేస్తే మరిన్ని విశేషాలు అందిస్తుంది అని చెబుతున్నారు.