Begin typing your search above and press return to search.

మోడీపై నిప్పులు చెరిగిన ఓవైసీ... క్విట్ ఇండియాపై సెటైర్స్ పీక్స్!

ఈ సందర్భంగా ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్ధాయిలో టార్గెట్ చేశారు. ఇదే సమయంలో హోమంత్రి అమిత్ షా పై తనదైన శైలిలో ఫైరయ్యారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 1:30 PM GMT
మోడీపై నిప్పులు చెరిగిన ఓవైసీ... క్విట్  ఇండియాపై సెటైర్స్  పీక్స్!
X

మణిపూర్ లో జరిగిన ఘోరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీపై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎఫెక్ట్ మణిపూర్ లో శాంతిస్థాపన చేయలేకపోతుందంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ సమయంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇందులో భాగంగా జరిగిన చర్చల్లో అసదుద్ధీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... మణిపూర్ అంశంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరుగుతున్న చర్చలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన తీవ్ర స్ధాయిలో టార్గెట్ చేశారు. ఇదే సమయంలో హోమంత్రి అమిత్ షా పై తనదైన శైలిలో ఫైరయ్యారు.

తాజాగా అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన ఒవైసీ... దేశంలో ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని, పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న కులభూషణ్ జాదవ్ ను వెనక్కి తీసుకురాలేకపోతున్నారి, ముఖ్యంగా బీజేపీ నేతలు చేస్తున్న క్విట్ ఇండియా నినాదం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా.. హర్యానా ఘటనల్లో ముస్లింలను టార్గెట్ చేస్తున్నప్పుడు కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రధాని మోడీని ప్రశ్నించిన ఓవైసీ... దేశవ్యాప్తంగా ముస్లింలపై విద్వేషం ఎందుకు పెంచుతున్నారని నిలదీశారు. అసలు కేంద్ర కేబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి కూడా ఎందుకు లేరని ఓవైసీ సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే సీఎంను ఎందుకు తప్పించడం లేదని అడిగారు. మణిపూర్ లో ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రధాని మోడీ ఎందుకు అక్కడికి వెళ్లకుండా మౌనంగా ఉండిపోతున్నారని ప్రశ్నించారు. కేంద్రం చేస్తున్న రాజకీయాల వల్ల దేశానికి నష్టం జరుగుతుందని ఓవైసీ ఆరోపించారు.

ఇదే క్రమంలో ముఖ్యంగా క్విట్ ఇండియా అంటూ విపక్షాలపై కేంద్రమంత్రులు చేస్తున్న విమర్శలకు అసద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా... మన హోంమంత్రి క్విట్ ఇండియా గురించి మాట్లాడుతున్నారని మొదలుపెట్టిన ఆయన... క్విట్ ఇండియా అనే పదాన్ని ఒక ముస్లిం సృష్టించాడని తెలిస్తే ఈ పదాన్ని ఇకపై ఉపయోగించడని అన్నారు.

క్విట్ ఇండియా అంటూ విపక్షాలను విమర్శిస్తున్న కేంద్రం.. హర్యానా మత ఘర్షణలకు కారకుడైన మాంటీ మనేసర్ ను ఎప్పుడు క్విట్ ఇండియా చేస్తుందని.. భారత్ లోకి చొరబడిన చైనాను ఎప్పుడు క్విట్ ఇండియా చేస్తుందని సూటిగా ప్రశ్నించారు. క్విట్ ఇండియా పేరుతో దేశాన్ని కేంద్రం మరోసారి విభజించాలని చూస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.