పండుగ పూట పనికిమాలిన పంచాయితీ అవసరమా అసద్?
అందరూ ఒకేలా ఉండరు. అలా అని కొందరి మాటల్నిఅందరికి వర్తించేలా చేయటం వల్ల సాధించేదేంటి? వీలైతే ప్రేమను పంచాలే కానీ ద్వేషాన్ని కాదు.
By: Garuda Media | 21 March 2026 11:00 AM ISTఅందరూ ఒకేలా ఉండరు. అలా అని కొందరి మాటల్నిఅందరికి వర్తించేలా చేయటం వల్ల సాధించేదేంటి? వీలైతే ప్రేమను పంచాలే కానీ ద్వేషాన్ని కాదు. ఆ విషయాన్ని మజ్లిస్ అధినేత అసద్ తరచూ మర్చిపోతుంటారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయటం.. సంచలనానికి తెర తీసేలా వ్యవహరిస్తుంటారు. తన రాజకీయ పరపతిని పెంచుకునేందుకు అతగాడు పడే తాపత్రయం చూస్తూ.. ఇలాంటి నేత ద్వేషాన్ని వదిలేస్తే ఎంత బాగుండు? అన్న భావన కలుగుతుంది. తాజాగా రంజాన్ పర్వదినానికి ముందు రోజు చార్మినార్ దగ్గర్లోని మక్కా మసీదులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్వేషాన్ని ఎగదోసేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
మహారాష్ట్రలో ముస్లింలు తయారు చేసే ఏ వస్తువును కొనుగోలు చేయవద్దని తీర్మానం చేసినోళ్లు.. అరబ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, డీజిల్, పెట్రోల్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారంటూ అర్థం లేని వాదనను తెర మీదకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఉత్తరప్రదేశ్ లోని గంగానదిలో ముస్లిం యువకులు పడవలో ఇఫ్తార్ విండు చేస్తే. గంగానది అపవిత్రం చేశారంటూ వారిపై కేసులు నమోదు చేశారన్నారు.
ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో రంజాన్ పండుగ జరుపుకోకుండా అడ్డుకుంటేస్తానికులు ఢిల్లీహైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారన్నారు. ఇలా ప్రపంచంలో జరిగే అంశాల్ని ప్రస్తావించిన అసద్.. కొన్ని అంశాల్ని మర్చిపోయారు. ఒక్కో ప్రంతంలో ఒక్కోలాంటి పరిస్థితి ఉంటుంది.అలా అని తప్పుల్ని తప్పులుగా.. ఒప్పుల్ని ఒప్పులుగా ఒప్పుకోమంటే తప్పే. ఇన్ని మాటలు చెప్పే అసద్.. ఏ రోజైనా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును నిర్వహించినట్లుగా.. హిందువుల పండగల సందర్భంగా ఏ ఒక్క పండగకైనా.. తాము ప్రాతినిధ్యం వహించే పాతబస్తీలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని హిందువుల కోసం ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహిస్తున్నారా?
పక్కనున్న బంగ్లాదేశ్ లో హిందువులను చంపేస్తుంటే.. నిరసన వ్యక్తం చేయని అసద్ అండ్ కో.. అక్కడెక్కడో ఇరాన్ లో జరిగే యుద్ధాన్ని.. పాలస్తీనా దాడుల గురించి నిరసనలు చేయటం ఏమిటి? ముస్లింలను ఇబ్బంది పెట్టే నిర్ణయాల గురించి మాట్లాడే అసద్.. హిందువులను టార్గెట్ చేసే అంశాల గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అన్నింటికి మించి మైనార్టీల గురించి మాట్లాడే అసద్.. ఆ పని చేయుద్దని ఎవరూ చెప్పరు. కాకుంటే.. పండుగపూట కూడా విద్వేషాన్ని రగిలించేలా స్పీచులు ఇవ్వటం ఏమిటి? అన్నది ప్రశ్న.
ముస్లింల వద్ద కొనొద్దన్న వారు అరబ్ దేశాల నుంచి చమురు ఎందుకు కొంటున్నారని ప్రశ్నిస్తున్న అసద్.. రేపొద్దున భారత్ మిత్రపక్షాలుగా ఉండొద్దనిఅరబ్ దేశాల్ని కూడా కోరతారా?మత పంచాయితీలను అక్కడి వరకు ఆపాలే కానీ.. దానికి మించి విషయాల్ని తీసుకెళ్లకూడదు. అంతదాకాఎందుకు ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్దంలో ఇరాన్ తన చుట్టూ ఉన్న ముస్లిం దేశాల మీద దాడులు చేస్తుంది కదా? మరి.. ఇరాన్ కు మద్దతు పలికే అసద్.. మిగిలిన అరబ్ దేశాల్లో జరుగుతున్న దాడులను ఎందుకు ఖండించరు?
ఇరాన్ తీరును ఎందుకు ప్రశ్నించరు. ఇరాన్ మీద దాడి చేస్తున్న ఇజ్రాయెల్ తో మిగిలిన అరబ్ దేశాలు స్నేహపూర్వకంగా ఎందుకు ఉంటున్నాయి? అదే అంశాన్ని అరబ్ దేశాల్ని కూడా ప్రశ్నిస్తారా అసద్?అందుకే.. అర్థం లేని కొన్ని అంశాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. వీలైతే.. మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతూ.. ఏళ్లకు ఏళ్లు మీకు ఓట్లు వేస్తున్న నియోజకవర్గ ప్రజలకు మేలు కలిగేలా.. పాతబస్తీ రూపురేఖలు మారేలా.. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది కానీ.. ఇలాంటి ద్వేషాల్ని నూరిపోయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.
