ప్రతీపనికీ ‘ఏఐ’.. మీ క్రియేటివిటీ గోవిందా!
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ట్రెండ్ ఫాలో అవ్వాలని అంటారు. కానీ ఆ ట్రెండ్ మన శారీరక, మానసిక ఎదుగుదలకు పురిగొల్పితేనే ఫాలో అవ్వాలి.
By: Tupaki Desk | 26 Dec 2025 6:00 PM ISTకొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ట్రెండ్ ఫాలో అవ్వాలని అంటారు. కానీ ఆ ట్రెండ్ మన శారీరక, మానసిక ఎదుగుదలకు పురిగొల్పితేనే ఫాలో అవ్వాలి. లేదంటే బాలయ్య తొడగొడితే ట్రెయిన్ రివర్స్ పోయినట్టు మన పనితీరు కూడా రివర్స్ లోకి వెళుతుంది. ఒకప్పుడు మనిషికి శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. 60 ఏళ్లు దాటిన వారికే బీపీలు, షుగర్ లు , జుట్టు తెల్లబడేది. కానీ ఇప్పుడు అవి 20ల్లోనే వచ్చేస్తున్నాయి. కానీ అసహజ తిండి.. అలవాట్లు, శారీరక శ్రమ లేని పనులు. ఇలా టెక్నాలజీ ఎప్పుడూ మనిషిని ముందుకుతీసుకెళ్లాలి కానీ ఇలా వెనుకబడిపోయేలా చేయకూడదు.
ఒకప్పుడు సైకిళ్ల మీద వెళితే ఎక్సర్ సైజ్ జరిగితే. ఆరోగ్యం వచ్చేది. కానీ ఇప్పుడు బైక్ లు, కార్లతో మన శారీరక శ్రమ గంగలో కలిసింది. పొట్ట వచ్చి, కొవ్వుతో 30 ఏళ్లలోపే గుండె పోట్లు వచ్చేస్తున్నాయి. ఓవరాల్ గా మనకు ఉపయోగపడే సాధనాలే వాడాలి. అవసరం కోసం మితిమీరి వాడితే అవి మన జీవనానికే గండికొడుతాయన్న వాస్తవం తెలుసుకోవాలి.
ప్రస్తుతం మన జీవనాన్ని నడిపిస్తున్న కేవలం ‘ఏఐ’నే. ప్రతీ పనికి ఏఐనే వాడుతున్నాం. తిన్నా, పడుకున్నా, లేచినా.. ఏదైనా కొత్తది తెలుసుకోవాలన్నా కష్టపడకుండా ఏఐలో చూసి దాన్ని పాలో అవుతున్నాం.. కాపీ కొట్టేస్తున్నాం.. కానీ దీనివల్ల మీరు ఎంత సోమరిపోతులుగా తయారవుతున్నారన్న వాస్తవాన్ని మాత్రం గ్రహించడం లేదు.
అవును.. ప్రతీ పనికి ఏఐ టూల్స్ ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని తాజాగా శాస్త్రవేత్తలు బాంబుపేల్చారు. మనిషిగా మనం సొంతంగా ఆలోచిస్తూ ఎంతో క్రియేటివ్ పనులు చేస్తుంటాం. క్రియేటివిటీ అనేది మన జీవితంలో పనిలో అద్భుతాలు సృష్టిస్తోంది.
ఇటీవల కొంత మంది విద్యార్థులను మూడు విభాగాలుగా చేసి వారిని చాట్ జీపీటీ, గూగుల్ జెమిని సాయంతోపాటు సొంతంగా వ్యాసం రాయమన్నారు. ఏఐని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. అధికంగా ఏఐపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు హెచ్చరించారు.
మనిషిగా మనం సృష్టించిందే ‘ఏఐ’. దాన్ని ఎంతో కష్టపడి రూపొందించారు. అది మనిషికి సహాయకారిగా ఉంటోంది. అయితే అదే మనల్ని సోమరిపోతులుగా మార్చుతోందని.. మన శక్తి సామర్థ్యాలు, ఆలోచనలు అమలుచేయకుండా అడ్డుకుంటోందన్న వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది. సో ఇప్పటికైనా ఏఐని పక్కనపెట్టి మీరు సొంతంగా ఆలోచించండి.. మీకంటూ మీ సృజనాత్మకతను చాటిచెప్పండి. అప్పుడే ముందడుగు వేయగలుగుతారు.
