Begin typing your search above and press return to search.

భారత్ లో అడల్ట్ ఓటీటీ యాప్ షాకింగ్ రీచ్!

అయితే.. ఓటీటీ వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 12:30 AM GMT
భారత్  లో అడల్ట్  ఓటీటీ  యాప్  షాకింగ్  రీచ్!
X

డిజిటల్ విప్లవంలో భాగంగా ఎంటర్ టైన్ మెంట్ రంగంలో వచ్చిన కీలక మార్పు "ఓవర్ ది టాప్" (ఓటీటీ). ఒకప్పుడు సినిమాలు.. థియేటర్లు, టీవీల్లో మాత్రమే ప్రసారమయ్యేవి. అయితే.. ఓటీటీ వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం భారీ ఎత్తున ఊపందుకుంది.

ఈ క్రమంలో ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌ పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ అందులో బీ-గ్రేడ్ యాప్ ఇప్పుడు వైరల్ రికార్డ్స్ సృష్టిస్తుంది. ఇందులో భాగంగా... "ఉల్లు" అనే యాప్ అనేక ప్రదర్శనలలో కనిపించే బీ-గ్రేడ్ మోడల్‌ లను కలిగి ఉంటూ సాహసోపేతంగా ఆ తరహా కంటెంట్ ను ప్రసిద్ధి చెందింది.

వాస్తవానికి ఈ ఫ్లాట్ ఫాం కంటెంట్ పూర్తిగా శృంగార భరిత కంటెంట్ పై దృష్టి పెడుతూ.. అసభ్యతను, అశ్లీలతను వ్యాప్తి చేస్తుందంటూ ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి కూడా విమర్శలను అందుకుంంది. అయితే... భారతదేశంలో అలాంటి కంటెంట్ ను ఆస్వాదించే ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

దీంతో... ప్రధానంగా... కవితా బాబీ, చార్మ్ సుఖ్, పలాంగ్ టోడ్ వరకూ ఈ ఉల్లూ దేశీ యాప్ లో శృంగార సిరీస్ లు, షార్ట్ సినిమాలను ఆస్వాదించే ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ తో నిండిపోయి ఉంటుంది. దీంతో ప్రస్తుతం ఉల్లుకు సుమారు 2.8 మిలియన్ల పెయిడ్ సబ్‌ స్క్రైబర్‌ లు ఉన్నట్లు తెలుస్తుంది.

ఇది నెట్‌ ఫ్లిక్స్ సబ్‌ స్క్రైబర్‌ లలో దాదాపు సగం అయినప్పటికీ ఇది సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నట్లే భావించాలనే మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నెట్‌ ఫ్లిక్స్ ప్రపంచం నలుమూలల నుండి వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందించిన అధిక నాణ్యత కంటెంట్‌ ను అందిస్తుండగా... ఉల్లు ప్రదర్శనలు 10-15 లక్షల చౌక బడ్జెట్‌ తో తయారు చేయబడతాయి.

అయినప్పటికీ 2.8 మిలియన్ల సబ్‌ స్క్రైబర్‌ లను కలిగి ఉండటం పెద్ద విషయం అని అంటున్నారు. ఈ ఫ్లో కంటిన్యూ అయితే... స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ ప్రైజెస్ లో ఈ యాప్ టాప్ ప్లేస్ కి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు!