Begin typing your search above and press return to search.

జగన్ విత్ కామ్రేడ్స్... ఆ పార్టీ క్రీనీడలు

ఏపీలో విపక్ష రాజకీయం చాలా గందర గోళంగా ఉంది. ఎక్కడైనా అధికార పార్టీని వ్యతిరేకించే శక్తులు ఒక్కటిగా కలుస్తాయి.

By:  Satya P   |   3 Nov 2025 5:00 PM IST
జగన్ విత్ కామ్రేడ్స్... ఆ పార్టీ క్రీనీడలు
X

ఏపీలో విపక్ష రాజకీయం చాలా గందర గోళంగా ఉంది. ఎక్కడైనా అధికార పార్టీని వ్యతిరేకించే శక్తులు ఒక్కటిగా కలుస్తాయి. కానీ ఏపీలో మాత్రం అలాంటిది లేదు, దానికి కారణం ఇక్కడ చాలా ఈక్వేషన్స్ రిజర్వేషన్లు ఉన్నాయి. వాటి ప్రభావం వల్లనే ఎవరికి వారుగా యమునా తీరుగా ఉండిపోతున్నారు. వైసీపీ ఒంటరిగా పోటీ చేయడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆ పార్టీ మాది సింగిల్ పాలసీ అంటుంది. ఒంటరిగా వస్తామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఒంటరిగా వైసీపీ మిగిలిపోయిందని ఆ పార్టీతో ఎవరూ జట్టు కట్టే సీన్ లేదని ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తూంటారు.

వైసీపీ ఫిలాసఫీ :

ప్రతీ రాజకీయ పార్టీకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. వైసీపీ విషయానికి వస్తే కాంగ్రెస్ వ్యతిరేకత అన్నది ఆ పార్టీ స్టాండ్. ఆ వ్యతిరేకతతోనే తమ పార్టీ పుట్టింది అని నాయకులు చెబుతూ ఉంటారు. సహజంగానే ఈ వ్యతిరేకతతో బీజేపీకి వైసీపీ దగ్గర అవుతోంది అన్నది కూడా ఉంది. జాతీయ స్థాయిలో అనేక పార్టీలు కాంగ్రెస్ తో కలిసాయి. పొత్తులు పెట్టుకున్నాయి. ఆ మాటకు వస్తే తెలుగు నాట కాంగ్రెస్ తో కలవని పార్టీలు రెండే రెండు. అవి వైసీపీ జనసేన. జనసేనకు బీజేపీతో కలిసేందుకు అభ్యంతరాలు లేవు, అందుకే పొత్తు పెట్టుకుంది. అలాగే టీడీపీతో జట్టు కట్టింది. వైసీపీది అలాంటి పరిస్థితి కాదు.

బీజేపీతో బంధం :

ఇక వైసీపీ విషయం తీసుకుంటే బీజేపీతో దగ్గర తనమా లేక దూరంగా ఉంటోందా అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. నిజానికి వైసీపీని 2024 ఎన్నికల్లో కానీ అంతకు ముందు 2014 ఎన్నికల్లో కానీ ఓడించింది బీజేపీ కూడా. అలాంటి పార్టీ సహజంగానే ప్రత్యర్ధి కావాలి. కానీ వైసీపీ ఏ రోజూ బీజేపీని పెద్దగా విమర్శించిన దాఖలాలు అయితే లేవు. దానికి కారణాలు ఎవరికి వారుగా చెప్పుకుంటారు కొందరు తెర చాటు అవగాహన అంటారు, మరి కొందరు జాతీయ స్థాయిలో ఒక బంధం అంటారు. దానికి ఉదహరించేలా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇచ్చింది అని గుర్తు చేస్తున్నారు.

ఆ డౌట్ తీర్చాల్సిందే :

ఏపీలో వచ్చే ఎన్నికలు చాలా క్లిష్టంగా ఉండబోతున్నాయి. మరోసారి మూడు పార్టీల కూటమిగా ఎన్డీయే ఏపీలో ఎన్నికల సమరానికి దూసుకుని వస్తుంది. మరి విపక్షాల విషయం తీసుకుంటే కూటమి కడతాయా అంటే చాలా విషయాల్లో ఇంకా క్లారిటీ రావాలని అంటున్నారు. ఏపీలో కామ్రేడ్స్ వరకూ పొత్తులు లేదా అవగాహన పెట్టుకుని ముందుకు సాగాలని వైసీపీలో కొంతమంది భావిస్తున్నట్లుగా ప్రచారం అయితే సాగుతోంది. కానీ కామ్రేడ్స్ వైపు నుంచి సానుకూల సంకేతాలు లేవని అంటున్నారు. అదేంటి అంటే వైసీపీ మీద అనుమానం గా చూడడమే అంటున్నారు. వైసీపీ ఒక వైపు విపక్షంలో ఉంటూ అధికారంలో ఉన్న బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ని చూపిస్తోంది అన్న డౌట్లు అయితే వారిలో ఉన్నాయని అంటున్నారు. బీజేపీ అంటే కామ్రేడ్స్ కి సిద్ధాంతపరంగా విభేదించే పార్టీగా చెబుతారు. అందుకే వైసీపీ వైఖరి తేలితేనే తప్ప తాము అడుగులు వేసేది ఉండదని అంటున్నారు.

అయ్యే పని కాదా :

ఇక వైసీపీ విషయమే తీసుకుంటే టీడీపీ జనసేనల మీదనే ఆ పార్టీ బిగ్ సౌండ్ చేస్తుంది. బీజేపీకి ఈ విషయంలో మినహాయింపులు ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయిలో ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అన్నది కూడా ఉంది. ఏపీలో కామ్రేడ్స్ తోనే చాలు కానీ కాంగ్రెస్ వద్దు అన్నది కూడా ఉంది అంటారు. ఇలా చాలా విషయాల్లో ఏకీభావం అయితే కనిపించడం లేదని అంటున్నారు. అందుకే జగన్ తో కామ్రేడ్స్ నడక రాజకీయంగా ఉంటుందా ఉండదా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.