Begin typing your search above and press return to search.

అజిత్ దోవల్ చెప్పినా ట్రంప్ ఆపడం లేదు.. మడత మాటలు మానడం లేదు!

అవును... తాజాగా వైట్ హౌస్‌ లో రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ప్రైవేట్ విందులో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... ఆపరేషన్ సిందూర్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 July 2025 8:00 PM IST
అజిత్  దోవల్  చెప్పినా  ట్రంప్  ఆపడం లేదు.. మడత మాటలు మానడం లేదు!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ.. కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సయోధ్యకు కారణం తానేనని, వాణిజ్యం పేరు చెప్పి ఇరు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించినట్లు ట్రంప్ చెప్పుకుంటున్నారు. దీనిపై భారత్ వివరణ ఇస్తూనే ఉంది.

అయినప్పటికీ ట్రంప్ మానడం లేదు. పలు ప్రపంచ వేదికలపై ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నారు. దీనిపై నేరుగా ప్రధాని మోడీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత మానినట్లే మాని, మళ్లీ మొదలుపెట్టారు. ఈ సమయంలో ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ కొత్త మాటలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. భారత్‌ - పాక్ మధ్య ఘర్షణల్లో ఐదు జెట్‌ లు కూలిపోయాయంటూ వ్యాఖ్యానించారు.

అవును... తాజాగా వైట్ హౌస్‌ లో రిపబ్లికన్ శాసనసభ్యులతో జరిగిన ప్రైవేట్ విందులో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... ఆపరేషన్ సిందూర్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. భారత్‌ - పాకిస్తాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల్లో ఐదు జెట్‌ లు కూలిపోయాయని వ్యాఖ్యానించారు. అయితే ఏ దేశ విమానాలను ఏ దేశం కూల్చింది అనే విషయంపై మాత్రం స్పందించలేదు.

కాగా... భారత జెట్‌ విమానాలను తమ వైమానిక దళం కూల్చివేసిందని.. వాటిలో మూడు ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయని.. అలాగే భారత్‌ పైలట్లను తాము బంధించామని పాక్ చెబుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై జూన్ 15న రాఫెల్‌ ఫ్రెంచ్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈఓ ఎరిక్ ట్రాపియర్ స్పందిస్తూ.. పాక్ వాదనలను తప్పుబట్టారు.

ఫ్రెంచ్ మ్యాగజైన్ ఛాలెంజెస్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ... మూడు రాఫెల్‌ లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చెప్పడంలో నిజం లేదని తెలిపారు. మరోవైపు మే 11న భారత పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని ఎయిర్ మార్షల్ ఏకే భారతీ మీడియాకు వెల్లడించారు.

ఇదే క్రమంలో... ఈ నెల 11న ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఇలాంటి ప్రచారాలపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాక్ దాడుల్లో భారత్ కు నష్టం వాటిళ్లిందంటూ విదేశీ మీడియా చేస్తోన్న ప్రచారంపై స్పందిస్తూ.. పగిలిన గాజు ముక్కైనా చూపించాలంటూ సవాల్ విసిరారు.