Begin typing your search above and press return to search.

ప్రకాశ్ రాజ్ - వరాహం... ఫోటోలతో తెలంగాణ బీజేపీ కౌంటర్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 May 2025 6:50 PM IST
ప్రకాశ్  రాజ్ - వరాహం... ఫోటోలతో తెలంగాణ బీజేపీ కౌంటర్!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ తీవ్ర చర్చనీయాంశమైన విషయం అనే సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత్.. పాక్, పాక్ అక్రమిత కశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలని నాశనం చేయడంతో పాటు.. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది ఇండియన్ ఆర్మీ గ్రేట్ సక్సెస్ గా దేశం కొనియాడుతోంది!

మరోపక్క... ఈ ఆపరేషన్ సిందూర్ చుట్టూ పొలిటికల్ కామెంట్లూ వినిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ చుట్టూ చర్చ నడుపుతున్నారని.. దీన్ని రాజకీయ మైలేజ్ గా ఉపయోగించుకుంటున్నారని.. ఈ క్రమంలో ఈ ఆపరేషన్ ద్వారా భారత్ కు జరిగిన సైనిక, ఆర్థిక నష్టాన్ని వెళ్లడించడం లేదనే కామెంట్లు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయని అంటున్నారు.

మరోపక్క మొన్న బీహార్ అయినా, నిన్న రాజస్థాన్ అయినా.. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోడీ బలంగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా భారత మహిళల నుదిటిన సిందూరం తుడిచివేసిన పాక్ ఉగ్రవాదుల ప్రాణాలు తీశామని చెబుతున్నారు. ఈ సమయంలో ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ ఘాటుగా స్పందించింది!

అవును... ఆపరేషన్ సిందూర్ పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోన్న వేళ.. ఈ ఘటనను బీజేపీ నేతలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే మాటలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయని అంటున్నారు! ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు!

"హాస్పటల్ సిందూర్.. సిందూర్ డోనేషన్ క్యాంప్" అని రాసి.. మోడీ రక్తంతో సిందూరం తయారు చేసి మహిళల నుదిటిన పెడుతున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేశారు! “మోడీ నరరాల్లో ఎన్నికలే ప్రవహిస్తాయి తప్ప మరేమీ లేదంటూ” కామెంట్ చేశారు! దీంతో.. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కామెంట్ సెక్షన్ లో చిన్నసైజు వార్ నడుస్తోంది!

ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ బీజేపీ... "ఒక్కడు" సినిమాలోని ఓ సీన్ లో బురదలో పడిన ప్రకాశ్ ఫోటోతో పాటు.. బురదలో ఉన్న వరాహం (పంది) ఫోటోను షేర్ చేసి... "రెండూ ఒకటేనా?" అని రాసుకొచ్చింది! ఈ స్థాయిలో స్ట్రాంగ్ గా స్పందించింది!