'నీరు, నెత్తురు కలిసి ప్రవహించలేవు'... పాక్ కు మోడీ స్పష్టమైన సందేశం!
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
By: Tupaki Desk | 12 May 2025 11:33 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి తొలిసారిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. సింధు నదీ జలాల ఒప్పందం రద్దు పునరుద్ధరణపై క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా... నీరు, నెత్తురూ కలిసి ప్రవహించలేవని స్పష్టం చేశారు.
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం తొలిసారిగా జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. పహల్గాంలో 25 మంది పర్యాటకులు, ఒక కాశ్మీరిని దారుణంగా హత్య చేశారని.. ఆ దాడి తర్వాత, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడానికి ఎలాంటి ప్రణాళికలూ లేవని.. నీరు, నెత్తురు ప్రస్తావన పాకిస్థాన్ కు స్పష్టమైన సందేశమని అన్నారు.
ఇదే సమయంలో... ఉగ్రవాదం, చర్చలు కలిసి జరగవని.. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవవని.. నీరు, నెత్తురు కూడా కలిసి ప్రవహించవని ప్రధాని మోడీ తన సందేహంలో పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికి భారత్ తన చర్యను మాత్రమే నిలిపివేసిందని.. దాని తదుపరి చర్య, పాకిస్థాన్ చర్యలపై ఆధారపడి ఉంటుందని దాయాదీని హెచ్చరించారు.
అదేవిధంగా... ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ఆపరేషన్ సిందూర్ స్పష్టంగా చెప్పిందని నొక్కి చెప్పిన ప్రధాని... దాని నిబంధనల ప్రకారం అది ఉగ్రవాదానికి ప్రతిస్పందిస్తుందని, ఇకపై ఇస్లామాబాద్ తరచూ ఉపయోగించే అణు బ్లాక్ మెయిల్ ను సహించబోమని స్పష్టం చేశారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్థాన్ పై భారత్ తీసుకున్న వరుస దౌత్యపరమైన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ప్రధానంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం ఒకటి. ఇది.. 1960లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ ప్రెసిడెంట్ మహ్మద్ ఆయుబ్ ఖాన్ సంతకం చేసిన ఇరు దేశాల మధ్య జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం!