Begin typing your search above and press return to search.

పాక్ కిరానా హిల్స్ ను భారత్ టార్గెట్ చేయలేదు.. ఏమిటి వాటి స్పెషల్?

ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్ లోని కిరానా హిల్స్ ను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు.

By:  Tupaki Desk   |   12 May 2025 7:29 PM IST
పాక్  కిరానా హిల్స్  ను భారత్  టార్గెట్  చేయలేదు.. ఏమిటి వాటి స్పెషల్?
X

ఆపరేషన్ సిందూర్ పై రక్షణశాఖ అధికారులు బ్రీఫింగ్ ఇస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా.. మే 6, 7 రాత్రి నుంచి మే 10 శనివారం సాయంత్రం సీజ్ ఫైర్ ప్రకటన వరకూ ఏమి జరిగిందనే విషయాలను క్షుణ్ణంగా వివరిస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం మరోసారి ఆర్మీ అధికారులు మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా పాక్ లోని కిరానా హిల్స్ టాపిక్ వచ్చింది.

అవును... మే7న ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జరిపిన దాడుల్లో ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణశాఖ అధికారులు పునరుధ్గాటించారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్ పై దాడుల వీడియోలను రక్షణ శాఖ అధికారులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోకి కిరానా హిల్స్ ను టార్గెట్ చేశారా.. అది అత్యంత కీలకమైన ప్రాంతం కదా అనే ప్రశ్న అధికారులకు ఎదురైంది!

ఈ సందర్భంగా స్పందించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత సైన్యం పాకిస్థాన్ లోని కిరానా హిల్స్ ను లక్ష్యంగా చేసుకోలేదని వెల్లడించారు. ఈ హిల్స్ ఎందుకు అంత ప్రత్యేక మంటే... పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆ కిరానా హిల్స్ వద్దే నిల్వ చేస్తుందని అంటారు. ఈ విషయంపై థాంక్స్ చెప్పారు భారతి!

ఇందులో భాగంగా... పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు థాంక్స్ అని అన్నారు. అనంతరం.. అక్కడ ఏమైనా ఉండనీ కానీ, తాము మాత్రం ఆ హిల్స్ ను టార్గెట్ చేయలేదని.. తాము లక్ష్యంగా చేసుకున్నామని ఇప్పటివరకూ చెప్పిన జాబితాలో అది లేదని వెల్లడించారు.

వాస్తవానికి ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ అణు స్థావరంపై దాడి గురించి రకరకాల ప్రచారాలు హల్ చల్ చేశాయి. ప్రధానంగా సర్గోధా వైమానిక స్థావరాన్ని టార్గెట్ చేసినట్లు భారత సైన్యం ధృవీకరించింది. దీంతో.. ఆ వైమానిక స్థావరానికి సమీపంలోనే ఈ కిరానా హిల్స్ ఉండోచ్చని చెప్తున్నారు. దీనిపై భారత సైన్యం క్లారిటీ ఇచ్చింది.

ఇదే సమయంలో... పాకిస్థాన్, పీవోకే ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే ధ్వంసం చేశామని.. ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు చేశామని తెలిపారు. ఇక అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో పాక్ డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను తిప్పికొట్టామని అన్నారు. ఈ క్రమంలో సైన్యానికి, ప్రజలకు పెద్దగా నష్టం రాకుండా చూశామని తెలిపారు.