పాక్ ఎన్.ఎస్.సి. కీలక నిర్ణయం... 96 గంటల్లో ఏమి చేసేద్దామని?
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశమైంది.
By: Tupaki Desk | 7 May 2025 11:37 PM ISTపాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన అనంతరం పాకిస్థాన్ ప్రధాని.. తన సాయుధ దళాలకు సంబంధిత చర్యలు చేపట్టడానికి అధికారం ఇచ్చినట్లు తెలిపారు! పాక్ ప్రధాని షెబాజ్జ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా కమిటీ (ఎన్.ఎస్.సి) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది!
అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ ప్రధాని అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా భారత్ వైమానిక దాడులకు ఆత్మరక్షణ కోసం ప్రతిస్పందించే హక్కును తమ దేశం కలిగి ఉందని పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి చార్టర్ లోని ఆర్టికల్ 51ని ఉంటంకిస్తూ.. అమాయక పాకిస్థానీ ప్రాణాలను కోల్పోయినందుకు, దాని సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించినందుకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాక్ కి ఉందని పేర్కొంది. భారత్ సైనిక చర్యలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం యుద్ధ చర్యలుగా ఉన్నాయని పేర్కొంది.
96 గంటల్లో ఏమి చేసేద్దామని..?:
ఈ విధంగా భారత్ తో యుద్ధానికి సై అంటున్నట్లు పాక్ కబుర్లు ఉన్నప్పటికీ.. వారి వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ ఆర్మీ తీవ్రమైన మందుగుండు సమాగ్రి కొరతను ఎదుర్కోంటుందని అంటున్నారు. యుద్ధం వస్తే వారి వద్ద కేవలం 4 రోజులకు సరిపడా మందుగుండు మాత్రమే ఉందని చెబుతున్నారు.
వాస్తవానికి ఒకప్పుడు పాక్ వద్ద మందుగుండు నిల్వలు బాగానే ఉండేవట. అయితే ఉక్రెయిన్ తో ఆ దేశం చేసుకున్న ఆయుధ ఒప్పందాల నేపథ్యంలో పాక్ యుద్ధ నిల్వలు ఖాళీ అయిపోయాయని అంటున్నారు. సైన్యానికి మందుగుండును సరఫరా చేసే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఇబ్బందులు పడుతుందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వద్ద ఉన్న మందుగుండు, యుద్ధానికి సరిపోయే నిల్వలు కేవలం 96 గంటలకు మాత్రమే సరిపోతాయని చెబుతున్నారు. అవేవీ లేకుండా భారత్ వంటి బలమైన దేశాన్ని ఎదుర్కోవడం పాక్ కు తీవ్ర అసాధ్య అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా.. పాక్ సైనిక అధికారుల్లో ఆందోళన నెలకొందని తెలుస్తోంది.
పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడి సూచన!:
ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రతీకార చర్యలకు దిగవద్దని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా... మునీర్ ని నియంతగా అభివర్ణించిన ఖన్నా.. పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని సూచించారు.
ఇదే సమయంలో... ఇరు వైపులా ప్రతీకారం ఉండకూడదని తాను ముందుగా అసిమ్ మునీర్ కు స్పష్టం చేయాలనుకుంటున్నట్లు ఖన్నా తెలిపారు. ఈ సందర్భంగా మునీర్ పై ఖన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... చట్టబద్ధమైన ఎన్నికలు నిర్వహించని నియంత మునీర్ అని.. ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో పెట్టడాన్ని కూడా మనం అర్ధం చేసుకోవాలని అన్నారు.
