‘సిందూరం భగ్గుమంటే ఎలా ఉంటుందో చూపించాం’.. మోడీ సంచలనం.. రాజస్థాన్ లో రప్పా రప్పా!
అవును... తాజాగా రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ... భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని
By: Tupaki Desk | 22 May 2025 2:13 PM ISTఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్, పీవోకేలలోని 9 ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన భారత్.. సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజస్థాన్ లో జరిగిన బహిరంగం సభలో మాట్లాడిన మోడీ.. పాక్ పై మాటలతో మరోసారి దాడి చేశారు.
అవును... తాజాగా రాజస్థాన్ లోని బికనీర్ లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ... భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ను మోకాళ్లపై కూర్చోబెట్టాయని.. భారత్ లో రక్తపుటేరులు పారించినవాళ్లను ముక్కలు ముక్కలుగా చేశామని నిప్పులు చెరిగారు! పాకిస్థాన్ ను మన తిరివిధ దళాలు ఉక్కిరిబిక్కిరి చేశాయని తెలిపారు.
ఈ సందర్భంగా... ఏప్రిల్ 22న జరిగిన దాడికి మనం 22 నిమిషాల్లో ఉగ్రవాదుల తొమ్మిది అతిపెద్ద స్థావారాలను నాశనం చేశామని అన్నారు. నాడు పహల్గాంలో పేలిన బుల్లెట్లు 140 కోట్ల మంది భారతీయుల హృదయాలను గాయపరిచామని.. అనంతరం మన మహిళల నుదిటిన సిందూరం చెరిపిన వారికి ఏమి జరుగుతుందో చేసి చూపించామని అన్నారు.
మన మహిళల సిందూరు ను తిడిచిపెట్టడానికి బయలుదేరిన వారిని మట్టిలో పాతిపెట్టామని.. భారతదేశపు రక్తాన్ని కళ్ల చూసినవారు ప్రతీ చుక్కకూ మూల్యం చెల్లించారని.. భారత్ మౌనంగా ఉంటుందని భవించిన వారు ఇప్పుడు తమ ఇళ్లలో దాక్కున్నారని.. వారి ఆయుధాలను గర్వంగా భావించినవారు వారి శిథిలాల కింద పాతిపెట్టబడ్డారని మోడీ అన్నారు.
భారత సైన్యానికి తాము పూర్తి సేచ్ఛనిచ్చామని చెప్పిన మోడీ.. త్రివిధ దళాలు కలిసి చక్రవ్యూహాన్ని అమలుపరిచాయని.. దీంతో పాకిస్థాన్ మోకరిల్లాల్సి వచ్చిందని అన్నారు. ఇకపై ఉగ్రవాదులకు ఇలాంటి సమాధానమే ఉంటుందని మోడీ నొక్కి చెప్పారు. ప్రస్తుతం పాక్ లోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఐసీయీలో ఉందని మోడీ ఎద్దేవా చేశారు!
ఈ పర్యటనలో భాగంగా... అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునర్నిర్మించిన దేశ్ నోక్ స్టేషన్ ను ప్రారంభించిన మోడీ.. ఇదే సమయంలో బికనేర్ - ముంబై ఎక్స్ ప్రెస్ రైలుకు జెండా ఊపారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించిన ఆయన.. దేశ్ నోక్ లోని కర్ణిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.