"ఇది రివేంజ్ కాదు.. న్యాయం"... ఆర్మీ తాజా వీడియో వైరల్!
ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు పంచుకున్న ఇండియన్ ఆర్మీ.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది.
By: Tupaki Desk | 18 May 2025 5:25 PM ISTఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచీ ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ రెండు వారాల సమయం తీసుకుని పక్కాగా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా.. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టింది. వీరికి ఆశ్రయం కల్పించిన పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసేసింది!
ఈ విధంగా ఆపరేషన్ సిందూర్ జరిగిన రోజు నుంచి మూడు రోజుల పాటు పాకిస్థాన్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. పాక్ లోని కీలకమైన ప్రాంతాలను టార్గెట్ చేసి, కచ్చితమైన లక్ష్యాలతో నాశనం చేసింది. ఈ క్రమంలో ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలను విడుదల చేసింది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలో తాజాగా మరో ఆసక్తికర వీడియోను పంచుకుంది.
అవును.. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి ఇప్పటికే పలు వీడియోలు పంచుకున్న ఇండియన్ ఆర్మీ.. తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి సైన్యం ఎలా ప్లాన్ చేసిందీ ఈ వీడియోలో వివరించింది! ఈ సందర్భంగా... "ప్లాన్డ్.. ట్రైయిన్డ్.. ఎగ్జిక్యూటెడ్" అంటూ ఎక్స్ వేదికగా ఈ వీడియోను పంచుకుంది.
ఈ వీడియోలోని సైనికులు... పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలలో ఆక్రోశం లావాలా పొంగిందని.. ఈసారి పాకిస్థాన్ కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకే ఒక ఆలోచన సైనికుల మనసుల్లో ఉందని.. ఇది ప్రతీకార చర్య కాదని.. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయమని.. ఉగ్రవాదులను పోషిస్తోన్న పాక్ కు తగిన గుణపాఠమని అన్నారు.
