ఆపరేషన్ సిందూర్.. వైరల్ గా ఇండియన్ ఆర్మీ వీడియో
నిమిషం కంటే కాస్త ఎక్కువగా ఉన్న ఈ వీడియోను ఎక్స లో మంగళవారం అర్థరాత్రి 1.24 గంటలకు (బుధవారం తెల్లవారుజామున) ఎక్స్ లో పోస్టు చేసింది.
By: Tupaki Desk | 7 May 2025 9:33 AM ISTదొంగచాటు దెబ్బల్లేవ్. ఏమైనా ఉన్నది ఉన్నట్లుగా.. చెప్పేదే చేస్తాం.. చేసేదే చెబుతామన్న సందేశాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేలా చేయటమే భారత్ నైజమన్న విషయాన్ని మరోసారి నిరూపించింది. పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం బదులు తీర్చుకుంది, పాకిస్థాన్ తో సహా.. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఈ మెరుపు దాడులకు ముందు.. భారత ఆర్మీ ఒక వీడియోను ఎక్స్ లో పోస్టు చేసింది.
నిమిషం కంటే కాస్త ఎక్కువగా ఉన్న ఈ వీడియోను ఎక్స లో మంగళవారం అర్థరాత్రి 1.24 గంటలకు (బుధవారం తెల్లవారుజామున) ఎక్స్ లో పోస్టు చేసింది. 'రెడీ టు స్ట్రైక్ ' అన్న క్యాప్షన్ తో వీడియోను విడుదల చేశారు. మెరుపు దాడులకు కాస్త ముందుగా పోస్టు పెట్టిన వైనం చూస్తే.. ఆపరేషన్ సిందూర్ ను ప్రపంచానికి ఓపెన్ గా చెప్పి మరీ దాడులకు పాల్పడినట్లుగా చెప్పాలి.
'దాడి చేయటానికి సిద్ధం. శిక్షణ తీసుకుంది గెలవటానికే' అంటూ పేర్కొన్న ఈ వీడియో అసాంతం భారత శక్తిని చాటేలా ఉందని చెప్పాలి. అంతేకాదు.. భారత ప్రజలు పడే వేదనను తానెంత సీరియస్ గా తీసుకుంటానన్న విషయాన్ని భారత ఆర్మీ తన వీడియోలో స్పష్టంగా చెప్పేసింది. ఈ వీడియోలో భారత ఆయుధ బలం.. యుద్ధ ట్యాంకర్లు.. వాటి శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉంటాయన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటం కనిపిస్తుంది.
'నమ్మకంగా చెబుతున్నా నిన్ను తుపాను వేగంతో కనుగొంటా. ఈ మెషిన్లు.. క్యారియర్లతో నిన్ను కనుగొంటాను. నా సోదరులు సోదరీమణుల వేదనను.. బాధను తీర్చేందుకు కచ్ఛితంగా నిన్ను కనుగొంటాను'' అంటూ 64 సెకన్లు సాగే ఈ వీడియో ఆద్యంతం భావోద్వేగంతో సాగుతుంది. తాము చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాల్ని ప్రపంచానికి తెలియజేయటంతో పాటు.. కొన్ని కీలక దేశాలకు సైతం ఆ సమాచారాన్ని షేర్ చేసిన వైనం చూసినప్పుడు.. భారత్ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని చేతలతో చెప్పేసిందని చెప్పాలి.
