Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్... ఆసక్తికరంగా సెలబ్రెటీల రియాక్షన్!

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ దీటైన సమాధానం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది.

By:  Tupaki Desk   |   7 May 2025 11:24 AM IST
ఆపరేషన్  సిందూర్... ఆసక్తికరంగా సెలబ్రెటీల రియాక్షన్!
X

పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ దీటైన సమాధానం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా... మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో పాకిస్థాన్, పీఓకే లోని 9 ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో సుమారు 80-90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది.

ఈ దాడులపై ప్రపంచ దేశాలు స్పందించాయి. ఈ సమయంలో భారత్ కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. మరోపక్క ఈ ఆపరేషన్ పై సెలబ్రెటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను రాస్తూ, భారత సైన్యానికి తమ మద్దతు ఉంటుందని చెబుతూ.. "భారత్ మాతాకీ జై" అని కామెంట్లు పెడుతున్నారు.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ సమయంలో.. ఎక్స్ వేదికగా ఆర్మీ పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. ఈ సమయంలో దేశంలోని సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఈ సమయంలో ఆపరేషన్ సిందూరు సక్సెస్ అయినందుకు ఆనందంగా ఉందంటూ చిరంజీవి "జైహింద్" అని రాశారు.

ఇదే సమయంలో... మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతోనే ఉంటాయని.. ఒకే దేశం, కలిసి నిలబడదాం అని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర రాశారు.

జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై అని నటుడు రితేశ్ దేశ్ ముఖ్ స్పందించారు.

ఇక సినీ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ స్పందిస్తూ... న్యాయం జరిగిందని చెబుతూ భారత్ మాతాకీ జై అని అన్నారు.

ఇదే సమయంలో... న్యాయం జరిగింది, జైహింద్ అని అల్లు అర్జున్ స్పందించగా... కచ్చితంగా జీరో టోలరెన్స్ అని సాయిధరం తేజ్ స్పందించారు. ఇండియన్ ఆర్మీని ట్యాగ్ చేశారు!

ఇదే క్రమంలో... 'ఆపరేషన్ సిందూర్’ లో మన భారత సైన్యం యొక్క భద్రత, బలం కోసం ప్రార్థిస్తున్నాను.. జై హింద్' అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.

ఇక, ఆపరేషన్ సిందూరు పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... ఇండియన్ ఆర్మీ చేసిన పోస్టుకు "జై హింద్" అని రాశారు.

మరోవైపు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూరు ను ప్రారంభించాయని.. ఇలాంటి సమయాల్లో అలాంటి చర్యలు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో, పౌరులను రక్షించడంలో ఉన్న అచంచలమైన శక్తిని ప్రతిబింబిస్తాయని తెలిపారు.

ఇదే క్రమంలో... భారతదేశ సార్వభౌమత్వాన్ని పరీక్షించడానికి ధైర్యం చేసే వారికి ఆపరేషన్ సిందూర్ లౌడ్ మెసేజ్ అని.. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత బలం, అచంచలమైన ధృడ సంకల్పంతో ఎదురుదాడి చేస్తుందని చెబుతూ... ఈ దేశానికి విడదీయరాని కవచంగా ఉన్నందున తాను మోడీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని నారా లొకేష్ ఎక్స్ వేదికగా రాశారు.