పాక్ కు బిగ్ షాకిచ్చిన దేశాలు.. కొలంబియా వేరే లెవెల్!
ఈ సమయంలో.. భారత్ కు అనుకూలంగా, పాక్ కు షాకిచ్చేలా పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని హామీ ఇస్తున్నాయి.
By: Tupaki Desk | 1 Jun 2025 3:06 PM ISTఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న పాకిస్థాన్ తీరును ఎండగట్టడానికి, ఆపరేషన్ సిందూరు గురించి వివరించడానికి భారత అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. భారత్ కు అనుకూలంగా, పాక్ కు షాకిచ్చేలా పలు దేశాలు స్పందిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని హామీ ఇస్తున్నాయి.
అవును... పాకిస్థాన్ ఉగ్రవాద అనుకూల తీరును ఎండగట్టడానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్న భారత ప్రతినిధుల బృందాలకు భారీ మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగా... ఉగ్రవాదంపై పోరాటం విషయంలో మీ వెంట నిలుస్తామంటూ ఆయా దేశాలు భారత్ కు స్పష్టమైన హామీ ఇస్తున్నాయి. ఈ సమయంలో కొలంబియా నిర్ణయం ఆసక్తిగా మారింది.
ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ లో జరిగిన ప్రాణ నష్టంపై కొలంబియా సంతాపం వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా సంతాపం వ్యక్తపరుస్తూ గతంలో వెలువరించిన ప్రకటనను కొలంబియా ఉహసంహరించుకుంది. ఈ విషయాన్ని అఖిలపక్ష పార్లమెంటరీ దౌత్య బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ధృవీకరించారు.
అంతకముందు.. కొలంబియా విదేశాంగశాఖ మంత్రి రోసా యోలాండాతో శశిథరూర్ బృంధం భేటీ అయ్యింది. ఇదే సమయంలో.. పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులతోనూ భేటీ అయ్యింది. మరోపక్క.. ఇథియోపియా ఉప ప్రధాని ఆడెం ఫరాతోనూ భారత బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన ఆడెం ఫరా... ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తో కలిసి పనిచేస్తామని తెలిపారు.
ఇదే సమయంలో... లాత్వియా దేశ విదేశాంగశాఖ మంత్రి ఆడ్రెజ్స్ విలుంసన్ తో డీఎంకే ఎంపీ కనిమొళి బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన ఆండ్రేజ్స్... ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ దేశం ఎప్పుడూ నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే.. ఐరాస లో లాత్వియా రాయబారి పిల్డెగోవిక్స్ తోనూ భారత బృందం భేటీ అయ్యింది.
ఇదే క్రమంలో... బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బృందం డెన్మార్క్ లో కొంతమంది ఎంపీలు, మాజీ మంత్రులు, దౌత్యవేత్తలతో సమావేశమైంది. ఇదే సమయంలో.. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ లార్స్ క్రిస్టియాన్ బ్రాస్క్ తోనూ భేటీ అయ్యింది. ఈ సందర్భంగా స్పందించిన రవిశంకర్.. ఉగ్రవాదంపై పోరాటంలో డెన్మార్ అందించిన మద్దతు మరువలేనిదని అన్నారు.
