కొత్త చర్చ: దావూద్ ఇల్లు మరాడా.. దేశం దాటాడా?
అవును... పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడుతున్న వేళ ఆ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకూ అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 9 May 2025 3:18 PM ISTఆపరేషన్ సింధూర్ అనంతరం పాక్ లో ఉంటున్న ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు, అండర్ వరల్డ్ డాన్ లు కలుగుల్లోకి దూరిపోతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ లోని ప్రధాన ఉగ్రవాద సంస్థల నేతలు ఇంకా వణుకుతూనే ఉన్నారని, తేరుకునేందుకు చాలా సమయం పట్టొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా సజీవంగా, ఆరోగ్యంగా ఉన్న అతికొద్ది మంది ఉగ్రవాదులను బోర్డర్ దాటించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ... ఆ ప్రయత్నాలను బీ.ఎస్.ఎఫ్. తుత్తినీయలు చేస్తున్న పరిస్థితి. వాళ్ల సంగతి అలా ఉంటే... మరోపక్క పాక్ లో దాక్కొన్న భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పరిస్థితి ఏమిటి.. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నట్లు అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... పాకిస్థాన్ పై భారత్ విరుచుకుపడుతున్న వేళ ఆ దేశ ప్రధాని నుంచి సామాన్య పౌరుల వరకూ అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు. అందుకు పాక్ లోనే దాక్కొన్న దావూద్ ఇబ్రహీం అతీతుడు కాదని అంటున్నారు. పైగా.. గురువారం రాత్రి ఇస్లాబాద్ సహా లాహోర్, కరాచీలలోనూ భారత్ డ్రోన్లు దాడులు చేసినట్లు చెబుతున్నారు. దీంతో.. దావూద్ సేఫ్ హౌస్ కి జారుకుని ఉంటాడని అంటున్నారు.
ఇదే సమయంలో.. దావూద్ తో పాటు చోట షకీల్, మున్నా జింగాలు సేఫ్ హౌస్ కి తరలించబడి ఉంటారనే చర్చ మొదలైంది. భారత్ నుంచి పారిపోయి పాక్ లో తలదాచుకున్న దావూద్ అండ్ కో.. తాజా దాడుల నేపథ్యంలో మరో దేశానికి పారిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరోవైపు... పాకిస్థాన్ ప్రధానే దాక్కున్నాడని అంటున్నప్పుడు వీరి పరిస్థితి అంతకంటే గొప్పగా ఉండే ఛాన్స్ లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
కాగా... గత కొన్ని సంవత్సరాలుగా దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అతడిని పాకిస్థాన్.. కరాచీలో సురక్షితంగా ఉంచిదని కూడా అంటారు. అయితే... తాజాగా పాకిస్థాన్ లోపలకు వెళ్లి భారత్ దాడులు చేస్తున్న వేళ.. దావూద్ కి భారత్ సైన్యం ‘హాయ్!’ చెప్పడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అతడు సేఫ్ హౌస్ కు వెళ్లిపోయి ఉంటాడని అంటున్నారు.
మరోపక్క గర రెండు రోజులుగా దావూద్ గురించి వస్తున్న వార్తలను, జరుగుతున్న ప్రచారాలను భారత భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని తెలుస్తోంది. ఈ దాడులు ముగిసే లోపు భారత్ కు కావాల్సిన ఉగ్రవాదులు, అండర్ వరల్డ్ డాన్ లు అంతా దొరికే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు.
