ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పోలీసులకేం పని... నెటిజన్లు ఫైర్!
పహల్గాం ఉగ్రదాడితో తీవ్రంగా రగిలిపోయిన భారత్.. తాజాగా గురవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 May 2025 6:00 PM ISTపహల్గాం ఉగ్రదాడితో తీవ్రంగా రగిలిపోయిన భారత్.. తాజాగా గురవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ అని చెప్పి మంగళవారం అర్ధరాత్రి 1:05 నిమిషాలకు పాక్, పీఓకేలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో సుమారు 80-90 మంది ఉగ్రవాదులు మరణించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో... ఈ ఆపరేషన్లో ఉగ్రవాదుల్లోని కీలక నేతలు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో... భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఇదే సమయంలో.. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కు ఊహించని గట్టి దెబ్బ తగిలింది.
ఇందులో భాగంగా... బహవల్పూర్ లో భారత సైన్యం జరిపిన దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు సహాయకులు మరణించారని అంతర్జాతీయ మీడియా నివేదించింది. మరోపక్క బిలాల్ ఉగ్ర శిబిరం హెడ్ యాకుబ్ మొఘల్ హతమవ్వగా.. అతడి అంత్యక్రియల్లో పాక్ పోలీసులు కనిపించడం వైరల్ గా మారింది.
అవును... తాజాగా పాక్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ సైన్యం జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతి చెందగా... వీరిలో బిలాల్ ఉగ్ర స్థావరం హెడ్ యాకుబ్ మొఘల్ కూడా హతమయ్యాడు. ఈ సందర్భంగా తాజాగా అతడి అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తోటి ఉగ్రవాదులు, ఐ.ఎస్.ఐ. సిబ్బందితో పాటు పాక్ పోలీసులు పాల్గొనడం గమనార్హం.
ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం, తాము ఉగ్రవాదులను పెంచి పోషించడం లేదు, తాము శాంతి కాముకులం అని అంతర్జాతీయ మీడియా ముందు, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కబుర్లు చెప్పే పాకిస్థాన్ కు ఉగ్రవాదులకు ఉన్న అవినాభావ సంబంధానికి తాజా ఘటన ఓ ఉదాహరణ అని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఉగ్రవాది అంత్యక్రియల్లో పాక్ పోలీసులకు ఏమి పని అని నిలదీస్తున్నారు.
ఇలాంటి పనులే ఉగ్రవాదుల విషయంలో పాక్ వక్ర బుద్ధినీ, ధ్వంద్వ వైఖరినీ ప్రపంచం ముందు నిలబెడుతున్నాయని.. అయినప్పటికీ పాక్ తన బుద్ధి మార్చుకోవట్లేని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
