Begin typing your search above and press return to search.

మోడీ పేరెత్తిన ఉగ్రవాదులంతా పోతున్నారు... నెక్స్ట్ అతడేనా?

అయితే... తాజాగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల్లో అతడు ఉండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   10 May 2025 6:30 PM
మోడీ పేరెత్తిన ఉగ్రవాదులంతా పోతున్నారు... నెక్స్ట్ అతడేనా?
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ ను పాకిస్థాన్ కానీ, ఉగ్రవాదులు కానీ ఇప్పట్లో మరిచిపోయే అవకాశం అయితే లేదనే చెప్పాలి. ఆ విధంగా ఊహించని రీతిలో అన్నట్లుగా ఉగ్రవాదుల కూసాలు కదిలించేసింది భారత సైన్యం. ఈ ఆపరేషన్ లో 100 మందికి పైగా ఉగ్రమూకలు నాశనమయ్యారు. వారిలో మోడీ పేరెత్తిన ఉగ్రవాది ఉండటం గమనార్హం.

అవును.. సుమారు నాలుగేళ్ల కిందట భారత ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది, ఆ సంస్థ అగ్ర కమాండర్ ముదస్సర్ ఖదియాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే... తాజాగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సిందూర్ లో మృతిచెందిన ఉగ్రవాదుల్లో అతడు ఉండటం గమనార్హం.

తాజాగా ఆపరేషన్ సిందూర్ లో మృతిచెందిన 100కు పైగా ఉగ్రవాదుల జాబితాలో.. ఐదు పేరు బయటకు వచ్చాయి. అందులో ముదస్సర్ ఖదియాన్ ఖాస్ పేరు ఉంది. పైగా ఇతడి అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో పాక్ ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వాధికారులు పాల్గొన్న విషయం ప్రపంచానికి తెలిసిందే.

ఆ సంగతి అలా ఉంటే... పహల్గాంలో జరిగిన పాశవిక దాడిలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు.. అక్కడున మహిళలతో "వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి" అని చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో.. ఆపరేషన్ సిందూర్ లో మృతి చెందిన 100 మంది బ్యాచ్ లో కానీ.. నిన్న బీ.ఎస్.ఎఫ్. కాల్పుల్లో మరణించిన ఏడుగురిలో కానీ ఆ బ్యాచ్ ఉండి ఉండోచ్చని అంటున్నారు!

ఇదే సమయంలో.. ఆపరేషన్ సిందూర్ లో సుమారు 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ ని, నలుగురు సేవకులను కోల్పోయిన జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కూడా.. భారత ప్రధాని మోడీ పేరు ఎత్తి మాట్లాడాడు! ఇందులో భాగంగా.. భారత్ ను, ప్రధాని నరేంద్ర మోడీని నాశనం చేస్తానని హెచ్చరించాడు. త్వరలో ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో... నెక్స్ట్ భారత సైన్యం చేతికి దొరికే ఉగ్రవాదుల జాబితాలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఫస్ట్ ఉండి ఉండొచ్చనే ఆసక్తికర చర్చ నెట్టింట మొదలైంది. కాగా... ఇటీవల పాక్ పార్లమెంట్ లో ఎంపీ మాట్లాడుతూ... మోడీ పేరు కూడా ఎత్తలేని పిరికివాడు పాక్ ప్రధాని అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయం పాక్ ప్రధానికి ముందే తెలిసి మోడీ పేరెత్తడం లేదేమో!? అని అంటున్నారు నెటిజన్లు!