Begin typing your search above and press return to search.

మాక్ డ్రిల్ అన్నారు.. ఇదేందయ్యా

కానీ కట్ చేస్తే.. నిన్న అర్ధరాత్రి దాటాక ఇండియా చేసిన భీకర దాడికి పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది.

By:  Tupaki Desk   |   7 May 2025 3:43 PM IST
మాక్ డ్రిల్ అన్నారు.. ఇదేందయ్యా
X

పహల్గాం ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన దారుణ ఉదంతం జరిగి రెండు వారాలు కావస్తుండగా.. ఇంకా పాకిస్థాన్ మీద ఇండియా కౌంటర్ ఎటాక్ చేయడం లేదేంటని నిన్నటిదాకా చాలామంది రగిలిపోతూ కనిపించారు. సరిహద్దు నుంచి పాక్ మీద భీకర దాడి కోసం ఎదురు చూస్తుంటే.. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో మాక్ డ్రిల్స్ కోసం సన్నాహాలు చేయడం చాలామందికి అసహనం కలిగించింది.

ప్రత్యర్థి మీద దాడి చేస్తారనుకుంటే.. అటు వైపు నుంచి దాడి జరిగితే ఏం చేయాలో మాక్ డ్రిల్స్ ద్వారా జనాలకు అవగాహన కలిగించడం ఏంటి అనుకుంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. మోడీ సర్కారు అంటే పడని వాళ్లంతా దీని మీద మీమ్స్ వేయడంమొదలుపెట్టారు. ఇంటర్నెట్లో పాకిస్థాన్ వాళ్లు సైతం మాక్ డ్రిల్స్ గురించి ఎద్దేవా చేయడం కనిపించింది.

కానీ కట్ చేస్తే.. నిన్న అర్ధరాత్రి దాటాక ఇండియా చేసిన భీకర దాడికి పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో తమ దేశ పరిధిలోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద ఇండియా చేసిన దాడికి పాక్ బెంబేలెత్తిపోయింది. పక్కా సమాచారంతో ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేయడం.. పదుల సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టడం.. ఆర్థికంగా కూడా ఉగ్రవాదులను గట్టి దెబ్బ తీయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు నెలకొన్నాయి. ఇండియన్ ఆర్మీ ఇంటలిజెన్స్ సమాచారం మేరకు కేవలం ఉగ్రవాదులనే టార్గెట్ చేసుకుంటే.. పాకిస్థాన్ మాత్రం ప్రతి దాడిలో భాగంగా భారత పౌరుల మీద దాడి చేసి ప్రాణాలు తీయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

కాగా మాక్ డ్రిల్స్ అని చెప్పి ఇలా రియల్ ఎటాక్ చేయడం ఏంటి అంటూ పాకిస్థాన్ వాళ్లు తూచ్ అంటున్నట్లు, ఇది మోసం అని గగ్గోలు పెడుతున్నట్లు మీమ్స్ వేసి వాళ్లను ట్రోల్ చేస్తున్నారు ఇండియన్ నెటిజన్లు. ఇదిలా ఉండగా.. మోడీ సర్కారు మీద వెటకారంగా మాట్లాడే రాజకీయ ప్రత్యర్థులు, సోకాల్డ్ లౌకిక వాదులు ఆపరేషన్ సింధూర్ గురించి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోవడం గమనార్హం.