డ్రాగన్ ఫేక్ మార్కెంటింగ్... హెచ్.క్యూ-9 సంగతేమిటి చైనా?
ఈ క్రమంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ అనంతరం పాక్ కొన్ని ఫేక్ ప్రచారాలకు తెరలేపింది.
By: Tupaki Desk | 24 May 2025 4:00 AM IST'నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు నీ గురించి నేను చెబుతాను' అని అంటారు. ఈ విషయంలో పాకిస్థాన్ ని అడిగినా, చైనాను అడిగినా.. ఇరు దేశాల గురించి ఈజీగా చెప్పెయ్యొచ్చు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా ఆ రెండు దేశాలు చేస్తోన్న ఫేక్ ప్రచారాలు, ఫేక్ మార్కెంటింగ్ లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అదేమిటనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. పాక్ లోని ఉగ్రశిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత వైమానిక దళం 23 నిమిషాల్లోనే పాక్ లోని 9 ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసింది. ఆ సమయంలో.. పాకిస్థాన్ లోని గగనతల రక్షణ వ్యవస్థలు హెచ్.క్యూ-9 జామ్ అయిన పరిస్థితి.
దీంతో.. ఆ 23 నిమిషాల్లోనూ పాకిస్థాన్ గగనతలంలో భారత క్షిపణులు విధ్వంసం సృష్టించాయి. ఆ దేశానికి ఊహించని నష్టాన్ని కలిగించాయి. ఈ సమయంలో రక్షణగా నిలవాల్సిన చైనా మేడ్ హెచ్.క్యూ-9 క్షిపణి వ్యవస్థలు పూర్తిగా విఫలమయ్యాయి. వాటి ఎయిర్ బేస్ లు గట్టి దెబ్బలే తిన్నాయి. .భారత్ కు చెందిన ఒక్క క్షిపణిని కూడా అవి ఆపలేకపోయాయి.
ఈ నేపథ్యంలోనే రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్, రఫీకి ఎయిర్ బేస్ సహా 11 పాక్ ఎయిర్ బేస్ లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీనిపై ఇటీవల రాజస్థాన్ సభలో స్పందించిన ప్రధాని మోడీ.. భారత దాడి తర్వాత రహీం యూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఇంటెన్సివ్ కేర్ లోకి వెళ్లిందని వ్యాఖ్యానించిన పరిస్థితి.
ఈ క్రమంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ అనంతరం పాక్ కొన్ని ఫేక్ ప్రచారాలకు తెరలేపింది. ఇందులో భాగంగా.. భారత్ కు చెందిన యుద్ధ విమానాలను కూల్చేశామని చెప్పుకొంది. దీనిపై ఆ దేశ రక్షణ మంత్రిని మీడియా నిలిదీస్తే... సోషల్ మీడియాలో ఆ మేరకు ప్రచారం జరుగుతుందని చెప్పుకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చైనా ఫేక్ మార్కెంటింగ్ కు తెరలేపింది.
ఇందులో భాగంగా... ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను పాకిస్థాన్ పేల్చేసిందని.. ఆ సమయంలో తాము సరఫరా చేసిన జే-10సీ ఫైటర్ జెట్లనే పాక్ ఉపయోగించిందనే భ్రమను.. ప్రపంచం ముందు వాస్తవంగా ప్రజెంట్ చేయాలనుకుంటుంది చైనా. ఈ నేపథ్యంలో చైనా జే-10సీ ఫైటర్ జెట్లపై డాక్యుమెంటరీలు రూపొందిస్తోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... చైనా తయారు చేసిన జే-10సీ ఫైటర్ జెట్లు భారత్ కు ఏ మేరకు నష్టం కలిగించిందనే సంగతి కాసేపు పక్కనపెడితే... పాక్ నమ్ముకున్న హెచ్.క్యూ-9 గగనతల రక్షణ వ్యవస్థ మాత్రం భారత క్షిపణులను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది.. నేడు పాక్ లో 11 ఎయిర్ బేస్ లు ధ్వంసం అవ్వడానికి హెచ్.క్యూ-9 కారణం.
అయితే... ఈ విషయాన్ని చైనా వ్యూహాత్మకంగా దాచే ప్రయత్నం చేస్తూ... తాము తయారు చేసిన జే-10సీ ఫైటర్ జెట్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించాయని చెప్పుకుంటూ ఓ డాక్యుమెంట్ తీసి, ప్రపంచంతో నకిలీ మార్కెంటింగ్ చేయాలని భావిస్తోంది!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే... ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ ఉపయోగించిన బ్రహ్మోస్ క్షిపణి, ఎస్-400 రక్షణ వ్యవస్థ గురించి ప్రపంచం మొత్తం చర్చించుకుటోన్న పరిస్థితి. మరోపక్క ఈ యుద్ధంలో పాకిస్థాన్ వాడిన ఆయుధాల్లో 80శాతం చైనా తయారు చేసినవే అని అంటున్నారు.
దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా చైనా రక్షణ పరిశ్రమ విశ్వసనీయతమపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో.. తన ఆయుధాలను మరోమారు ప్రపంచం ముందు ప్రదర్శనకు పెట్టుకొంటుంది చైనా.
