'అన్నల' సామ్రాజ్యంలో కేంద్రం పాగా!
కాగా.. తాజాగా ఈ ప్రాంతంలోని సగ భాగం తమ వశం చేసుకున్న కేంద్ర భద్రతా బలగాలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాయి.
By: Tupaki Desk | 30 April 2025 4:45 PMఅడవిలో అన్నలకు శతృదుర్బేధ్యమైన అనేక ప్రాంతాల్లో కేంద్రం పాగా వేస్తోంది. ఒడిసా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టులకు కంచుకోటల వంటి.. వాటిని స్వాధీనం చేసుకుని.. జాతీయ పతాకాన్నిరెపరెపలాడిస్తోంది. ఇప్పటికే కీలకమైన హిడ్మా సామ్రాజ్యం (ఛత్తీస్‌గఢ్)లో కేంద్రం పాగా వేసింది. అక్కడ జాతీయ జెండా కూడా నాటింది. ఒకప్పడు హిడ్మా సామ్రాజ్యం అంటే.. అందరూ అధిరిపోయేవారు. అలాంటి హిడ్మా సామ్రాజ్యంలోనే కేంద్రం రెండు మాసాల కిందట చొచ్చుకుపోయి.. మావోయిస్టులను ఏరే సింది. ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన యాక్షన్‌ను బలంగా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా.. మరో మావోయిస్టు సామ్రాజ్యంగా పేరున్న తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల మధ్య ఉన్న ములుగు జిల్లా లోని మావోయిస్టు దుర్బేధ్య అటవీ ప్రాంతం కర్రెగుట్టలపై కేంద్ర బలగాలు జాతీయ జెండాను రెపరెపలాడించాయి. ఇదేమీ చిన్న విషయం కాదు.. మైదాన ప్రాంతానికి ఏకంగా 5-7 వేల అడుగుల ఎత్తున ఉన్న కొండలపై విస్తారమైన అటవీ ప్రాంతంలో మావో యిస్టులు తమ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కీలక సమావేశాలు సహా.. యువ మావోయిస్టులకు శిక్షణ కూడా ఇక్కడే ఇస్తారు. పైగా.. వారు చేపట్టే గెరిల్లా ఆపరేషన్ల.. తంత్రాలన్నీ ఇక్కడ నుంచే జరుగుతుంటాయి.
ఈ నేపథ్యంలో మావోయిస్టులకు అత్యంత అనుకూల ప్రాంతంగా దాదాపు 7 దశాబ్దాలకుపైగానే..కర్రెగుట్టల ప్రాంతం గుర్తింపు పొం దింది. చిట్టడవిని తలపించే వన్య ప్రాంతంలో కనీసం ఎదురుగా ఉన్న మనిషిని కూడా గుర్తించలేనంత గుబురుగా చెట్లు ఉంటా యి. అలాంటి ప్రాంతంలో గత 10 రోజులుగా కేంద్ర భద్రతా బలగాలు.. ఆపరేషన్ కగార్‌ను నిర్వహిస్తున్నాయి. 1200 మంది దళాలు.. ఇక్కడ నిరంతరం మావోయిస్టుల కోసం గాలిస్తున్నా.. కర్రెగుట్టల్లోని సగం ప్రాంతానికి మాత్రమే చేరుకోగలిగాయంటే.. ఎంత దుర్బేధ్య ప్రాంతమో అర్థమవుతుంది.
కాగా.. తాజాగా ఈ ప్రాంతంలోని సగ భాగం తమ వశం చేసుకున్న కేంద్ర భద్రతా బలగాలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాయి. తెలంగాణ సరిహద్దులోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని పూజారికాంకేరు, నంబి, గల్‌గం, నడిపల్లి వరకు మావోయిస్టుల ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు అందరూ అన్నలకు సాయం చేస్తారన్న పేరుంది. దీంతో కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రాంతంలో ప్రజలను భద్రతాధికారులు ఇప్పటికి రెండు నుంచి మూడు సార్లు ప్రశ్నించాయి. ఏదేమైనా.. అన్నల సామ్రాజ్యంలో కేంద్రం మరో జెండా పాతడం ప్రభుత్వ పరంగా విజయమేనని అంటున్నారు మేధావులు.