Begin typing your search above and press return to search.

అదిరే ఐడియా: టోల్ గేట్ పైన రెస్టారెంట్.. ఏపీలో ఎక్కడంటే?

ప్రయాణవేళ మార్గమద్యంలో దొరికే ఫుడ్ విషయంలో చాలామందికి చాలానే కంప్లైంట్లు ఉంటాయి. ఇటీవల కాలంలో ఆ కొరతను తీరుస్తూ కొన్ని హోటళ్లు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   29 July 2025 10:49 AM IST
అదిరే ఐడియా: టోల్ గేట్ పైన రెస్టారెంట్.. ఏపీలో ఎక్కడంటే?
X

అదిరే ఐడియా ఒకటి అందరిని ఆకర్షిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లకు.. హోటళ్లకు కొదవ లేదు. ఆహారప్రియులు ఎవరైనా తెలుగు నేలకు వస్తే.. వారికి పండుగే. అయితే.. వడ్డించే ఆహారం రుచిగా.. శుచిగా ఉండటమే కాదు దానికి మించి సరైన ప్లేస్ లో ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రయాణవేళ మార్గమద్యంలో దొరికే ఫుడ్ విషయంలో చాలామందికి చాలానే కంప్లైంట్లు ఉంటాయి. ఇటీవల కాలంలో ఆ కొరతను తీరుస్తూ కొన్ని హోటళ్లు వస్తున్నాయి.


ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని టంగుటూరు వద్ద జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన ఒక హోటల్ అందరిని ఆకర్షిస్తోంది. దీని స్పెషల్ ఏమంటే.. దీన్ని టోల్ ప్లాజా మీద ఏర్పాటు చేయటం. ఒంగోలు సమీపంలోని టంగుటూరు వద్ద ఎన్ హెచ్ 16 టోల్ గేట్ మీద ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్ దూర ప్రయాణాలు చేసే వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.

విశాలమైన పార్కింగ్ తో పాటు.. లిఫ్టు ద్వారా హోటల్ కు చేరుకునేలా చేసిన ఏర్పాటు అందరిని ఆకర్షిస్తోంది. టోల్ ప్లాజా మీదనే రెస్టారెంట్ ఉండటంతో వాహనదారులకు లాభిస్తోంది. దీనికి తోడు.. ఈ హోటల్ వ్యూ చూసినప్పుడు.. విశాలమైన రోడ్లు.. వాటిపై వేగంగా దూసుకెళ్లే వాహనాల్ని చూస్తూ గడిపేలా ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పాలి. హైదరాబాద్.. విశాఖపట్నం.. విజయవాడ నుంచి హైవే మీదుగా తిరుపతి వెళ్లే ప్రయాణికులకు ఈ టోల్ ప్లాజా రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. కొత్త తరహా అనుభూతిని అస్వాదించేందుకు వీలుగా ఉందంటున్నారు. దీనికి తోడు టోల్ ప్లాజా వెడల్పుగా.. విశాలంగా ఉండటం రెస్టారెంట్ కు అనువుగా ఉంటుంది. మొత్తంగా ఈ హోటల్ ఐడియా అదిరేలా ఉందన్న మాట వినిపిస్తోంది.