Begin typing your search above and press return to search.

2050 నాటికి మరణాల సంఖ్య పెరుగుతాయా?

2050 నాటికి ఏటా కోటి మరణాలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందుల వాడకానికి శరీరం అలవాటై పోతుంది.

By:  Tupaki Desk   |   16 April 2024 9:30 AM GMT
2050 నాటికి మరణాల సంఖ్య పెరుగుతాయా?
X

వైద్యరంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. ఎన్నో వ్యాధులకు మందులు కనుగొన్నారు. దీంతో మరణాలు వాయిదా పడుతున్నాయి. పూర్వం రోజుల్లో అన్ని రోగాలకు మందులు ఉండేవి కావు. దీంతో రోగాలు వచ్చిన వారు తగిన మందులు దొరకక టపా కట్టేసేవారు. ఇప్పుడు కొత్త రోగాలకు సైతం మందులు రావడంతో మరణాల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది.

దీంతో ఇటీవల కాలంలో మందుల వినియోగం పెరుగుతోంది. విచ్చలవిడిగా ఔషధాల వాడకం వలన కొంత కాలానికి అవి కూడా మొరాయించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. రోగకారక క్రిములు ఆ మందులకు లొంగని నిరోధకతను పెంపొందించుకోవడాన్ని ఏఎంఆర్ గా చెబుతుంటారు. ఇలా మందుల వాడకం పెరిగితే అనర్థాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.

2050 నాటికి ఏటా కోటి మరణాలు నమోదవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందుల వాడకానికి శరీరం అలవాటై పోతుంది. మందుల వాడకంలో కాస్త ఆలోచించాలి. విచ్చలవిడిగా మందులు వేసుకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. అందుకే మందుల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే భవిష్యత్ అంధకారమే అవుతుంది.

ఔషధాల వినియోగం కష్టాలు మిగిల్చుతోంది. మందులు వాడకంతో శరీరం కూడా మొద్దుబారిపోవడం ఖాయం. దీంతో మందులు అతిగా వాడటం కూడా మంచిది కాదని తెలుసుకోవాలి. ఇలా ఔషధాల వినియోగం సురక్షితం కాదని గ్రహించుకోవాలి. మందుల వాడకం తగ్గించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.

రోజురోజుకు మందుల వాడకం పెరుగుతోంది. రోగాల సంఖ్య కూడా ఎక్కువవుతోంది. దీంతోనే మందుల వాడకం కూడా రెట్టింపు స్థాయిలో ఉంటోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు లాంటి రోగాలు వేధిస్తున్నాయి. వాటిని నియంత్రణలో ఉంచుకోవడానికి మందులు వాడుతూనే ఉన్నాం. వీటిని తగ్గించుకునే మార్గాలు అన్వేషించాలి.