ఒక ఎఫైర్ ఖరీదు అక్షరాల రూ.18 లక్షల కోట్ల నష్టం..
Nvidia CEO జెన్సెన్ హువాంగ్‌కు చైనా వ్యాపారవేత్తతో సంబంధాలున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలు అమెరికా-చైనా టెక్ వార్ నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలకు దారితీసినట్లు కథనం పేర్కొంది. ఈ వివాదంతో ఇన్వెస్టర్లలో కలవరం, రూ.18 లక్షల కోట్ల సంపద నష్టం జరిగిందనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ఆరోపణలకు విశ్వసనీయమైన ఆధారాలు, మార్కెట్ నష్టానికి సంబంధించిన ధ్రువీకరణ అవసరం.
By: A.N.Kumar | 10 Nov 2026 3:07 PM ISTఎంత పెద్ద శక్తివంతుడైనా.. ఓ ‘కాంత’ దాసుడేనని ఊరికే అనలేదు పెద్దలు.. టెక్నాలజీలో తోపు అయిన ఎన్వీడియా సీఈవో అమ్మాయి పలకరించేసరికి ఫ్లాట్ అయిపోయి బెండ్ అయిపోయాడు. ఇప్పుడు తన ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు ప్రతిష్ట సహా మొత్తం కోల్పోయాడు.. ఒక వ్యక్తిగత వ్యవహారం.. ప్రపంచ టెక్ రంగంలో కలకలం రేపిందంటే మామూలు విషయం కాదు.. కార్పొరేట్ ప్రపంచంలో వ్యక్తిగత జీవితం.. కంపెనీ ప్రతిష్ఠ.. పెట్టుబడిదారుల నమ్మకం ఎంత బలంగా ముడిపడి ఉంటాయో ఎన్వీడియా వ్యవహారం మరోసారి చర్చకు తెరలేపింది.
చిప్‌లతో ప్రపంచాన్ని ఏలుతున్న టెక్ దిగ్గజం ఎన్వీడియా బోర్డు రూమ్‌లో ఇప్పుడు చిప్‌ల మోత కంటే.. గాసిప్‌ల మోతే ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవంతో ట్రిలియన్ల డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన సీఈవో జెన్సెన్ హువాంగ్.. ఇప్పుడు టెక్నాలజీతో కాదు.. తన 'వ్యక్తిగత టెక్' కనెక్షన్లతో గ్లోబల్ మార్కెట్లో సునామీ సృష్టించారు.
కంపెనీ వ్యాపారం ఒక్క రోజులో పడిపోలేదు. చిప్ ఫ్యాక్టరీలు మూతబడలేదు. అయినాసరే ఒక్క వ్యక్తిగత వ్యవహారం కారణంగా ఏకంగా రూ.18 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద గాల్లో కలిసిపోయింది. బిజినెస్ అంటే ప్రాఫిట్లు, ప్రొడక్షన్ అనుకునేవాళ్లకు.. "అసలు కథ బెడ్రూమ్ నుంచి బోర్డు రూమ్‌కి ఎలా మారుతుందో" ఎన్వీడియా ఉదంతం కళ్లకు కట్టింది.
ఎన్వీడియా సీఈవోకు చైనా 'స్పై అలైస్'తో సంబంధాలున్నాయంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం ఇప్పుడు వాల్ స్ట్రీట్‌లో మంటలు పుట్టిస్తోంది. అసలు చిప్‌లు ఎగుమతి కాకపోయినా.. సీఈవో గారి లవ్ స్టోరీ ఎగుమతులు మాత్రం సరిహద్దులు దాటి మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. అమెరికా-చైనా టెక్ వార్ నడుస్తున్న తరుణంలో ఈ ఎఫైర్ పుకార్లు కేవలం రొమాంటిక్ గోసిప్ లాగా కాకుండా 'నేషనల్ సెక్యూరిటీ' రేంజ్‌లోకి వెళ్లిపోయాయి. "రేపు పొద్దున మన కంపెనీ సీక్రెట్స్ కూడా ఆ లవ్ స్టోరీతో పాటు చైనాకి వాట్సాప్ ఫార్వర్డ్ అయిపోతాయేమో" అని ఇన్వెస్టర్లు హడలిపోతున్నారు.
ఇక్కడ అసలైన మ్యాటర్ ఏంటంటే.. ఈ ఆరోపణల్లో నిజానిజాలు బయటపడ్డాయి. తాను ఓ చైనీస్ వ్యాపారవేత్తతో ఎఫైర్ పెట్టుకున్నట్టు ఎన్‌వీడియో సీఈవో బయటపడ్డాడు.. దీంతో మార్కెట్ భయంతో హడలిపోయింది. ఎందుకంటే ఎన్వీడియా అంటేనే జెన్సెన్ హువాంగ్.. లెదర్ జాకెట్ వేసుకుని ఆయన స్టేజ్ మీదకొస్తే చాలు.. షేర్లు రాకెట్ లా దూసుకుపోతాయి. కానీ అదే ఐకాన్ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకునేసరికి ఇన్వెస్టర్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
అసలు టెక్నాలజీతో ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీకి.. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే సంబంధాలు ఒక పెద్ద ముప్పై రోజుల్లో తేల్చాల్సిన పరీక్షగా మారాయి. టెక్నాలజీలో గూఢచారులున్నా కనిపెట్టే ఏఐ టూల్స్ తయారు చేసే ఎన్వీడియా.. సొంత సీఈవో విషయంలో మాత్రం గుడ్డిలో మెళ్లలాగా చూస్తూ కూర్చోవాల్సి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత తెలివైనదైనా.. కార్పొరేట్ సెంటిమెంట్ ముందు బలాదూర్ అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
