భారత్ కంటే పాకిస్తాన్ సురక్షిత దేశమా..? నంబియో 2025 నివేదికలో షాకింగ్ నిజాలు!
ప్రపంచ దేశాల భద్రతా స్థాయిలను అంచనా వేసే నంబియో 2025 మిడ్-ఇయర్ సేఫ్టీ ఇండెక్స్ నివేదిక తాజాగా వెలువడింది.
By: Tupaki Desk | 23 July 2025 3:54 PM ISTప్రపంచ దేశాల భద్రతా స్థాయిలను అంచనా వేసే నంబియో 2025 మిడ్-ఇయర్ సేఫ్టీ ఇండెక్స్ నివేదిక తాజాగా వెలువడింది. ఈ నివేదిక పలు ఆశ్చర్యకరమైన అంశాలను వెలుగులోకి తీసుకురాగా, అందులో భారత్ కంటే పాకిస్తాన్ భద్రతలో మెరుగైన స్థానంలో ఉండటం విశేషంగా చర్చకు దారితీసింది.
- టాప్‌లో ఆండోరా
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా యూరప్‌లోని చిన్న దేశం ఆండోరా నిలిచింది. ఫ్రాన్స్, స్పెయిన్ మధ్య ఉన్న పైరెన్నీస్ పర్వత ప్రాంతాల్లో ఉండే ఈ దేశం, నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం 84.7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.
- మిడిల్ ఈస్ట్ దేశాల అద్భుత ప్రదర్శన
మిడిల్ ఈస్ట్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్, ఒమన్ దేశాలు అత్యల్ప క్రైమ్ రేటుతో అత్యంత సురక్షితంగా ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా UAE 85.2 స్కోరు నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశాల్లోని ప్రభుత్వాల కఠిన నిబంధనలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, పటిష్టమైన పాలనకు ఇది నిదర్శనం.
- భారతదేశం స్థానం?
భారతదేశం 147 దేశాల జాబితాలో 66వ స్థానంలో నిలిచింది. ఇది 55.7 స్కోరు సాధించింది. ఆశ్చర్యకరంగా భారత్ కంటే మెరుగైన స్థానాల్లో శ్రీలంక (59వ స్థానం), పాకిస్తాన్ (65వ స్థానం) ఉన్నాయి. పాకిస్తాన్ 65వ స్థానం పొందడం చాలా మందికి షాకింగ్ అంశంగా మారింది.
-ఇతర దేశాల ర్యాంకులు
UAE – 85.2 పాయింట్లు, ఆండోరా – 84.7 పాయింట్లు, యూకే – 47వ స్థానం, అమెరికా – 89వ స్థానంలో నిలిచాయి.
ఈ ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు?
నంబియో అనేది ఒక క్రౌడ్‌సోర్స్డ్ గ్లోబల్ డేటాబేస్. ఇందులో వాలంటీర్లు అందించే డేటాను ఆధారంగా తీసుకుని నేరాల స్థాయి, భద్రతా పరిస్థితులు, ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా సేఫ్టీ ఇండెక్స్ను రూపొందిస్తారు. ఈ సూచికలో ఎక్కువ స్కోరు వచ్చిన దేశాలను అత్యంత సురక్షిత దేశాలుగా పరిగణిస్తారు.
పాకిస్తాన్ వంటి దేశం భద్రత పరంగా భారతదేశాన్ని దాటేయడం భారత ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది భారత ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన సూచనగా చెప్పుకోవచ్చు. నగర భద్రత, మహిళల రక్షణ, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని. అదే సమయంలో, దేశ ప్రజలు కూడా చట్టాలకు కట్టుబడి, సామాజిక బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
