Begin typing your search above and press return to search.

న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌ మెరైన్‌ సిద్ధం... ప్రపంచానికి షాకిచ్చిన కిమ్‌!

ఈ క్రమంలో తాజాగా కిమ్‌ నేతృత్వంలోని ఉత్తరకొరియా.. ప్రపంచానికి షాకిచ్చే పనికి పూనుకుంది.

By:  Tupaki Desk   |   8 Sep 2023 6:45 AM GMT
న్యూక్లియర్‌  అటాక్‌  సబ్‌  మెరైన్‌  సిద్ధం... ప్రపంచానికి షాకిచ్చిన కిమ్‌!
X

ఈ ప్రపంచానికి ఎన్నో సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. పేదరికం, నిరక్ష్యరాస్యత, ద్రవ్యోల్బణం, ఆహార కొరత, నివాస స్థాలాలు లేకపోవడం, ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా బ్రతుకుతున్న సమాజం... ఈ సమస్యలన్నీ ఒకెత్తు అయితే ఉత్తర కొరియా లోని కిమ్‌ మరో సమస్య అని చెప్పుకున్నా అతిశయోక్తి కాదేమో!


ఈ క్రమంలో తాజాగా కిమ్‌ నేతృత్వంలోని ఉత్తరకొరియా.. ప్రపంచానికి షాకిచ్చే పనికి పూనుకుంది. అందులో భాగంగా ఏకంగా "టాక్టికల్‌ న్యూక్లియర్‌ అటాక్‌ సబ్‌ మెరైన్‌"ను తయారు చేసినట్లు ప్రకటించింది. దీంతో ఉత్తర కొరియా అణు కార్యక్రమాలను ఏమాత్రం ఆపడంలేదనే చర్చ మరోసారి మొదలైంది.


తాజాగా ప్యాంగ్యాంగ్‌ లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న కిమ్‌... ఓ షిప్‌ యార్డ్‌ లో సబ్‌ మెరైన్‌ ను పరిశీలిస్తున్న ఫొటోను అధికారికంగా విడుదల చేశారు. దీనిపై స్పందించిన ఉత్తర కొరియా న్యూస్‌ ఏజెన్సీ... దీని నుంచి అణ్వాయుధాలు కూడా ప్రయోగించవచ్చని పేర్కొంది.

అయితే ప్రస్తుతం రష్యా - ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కారణం... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తో కిమ్‌ త్వరలో భేటీ అయ్యే అవకాశాలు ఉండటమే. ఉక్రెయిన్‌ తో యుద్ధం కోసం రష్యా ఆయుధాలను సమీకరించాలనుకుంటోందని, ఈ నేపథ్యంలోనే కిమ్‌ ఆ దేశంలో పర్యటించే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన ఒక అధికారి వెల్లడించారు!

ఆ సంగతి అలా ఉంటే... ఉత్తర కొరియా తాజాగా వెలుగులోకి తెచ్చిన ఈ సబ్ మెరైన్... సోవియట్‌ కాలం నాటి రోమియో శ్రేణి డిజైన్‌ ఆధారంగా చేసినట్లు తెలుస్తుంది. దీనికి "హీరో కిమ్‌ గన్‌ ఓకే" అనే పేరు పెట్టగా.. దీని హల్‌ నంబర్‌ 841. దీని నుంచి రెండు వరుసల్లో 10 న్యూక్లియర్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌ ను ప్రయోగించవచ్చని చెబుతున్నారు.