Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఇంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్!

గురువారం వేకుమజామునే తన అన్నతో కలిసి తాత సమాధి వద్దకు నివాళులు అర్పించడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు

By:  Tupaki Desk   |   19 Jan 2024 9:21 AM GMT
బాలకృష్ణ ఇంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్!
X

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని "ఎన్టీఆర్ ఘాట్" వద్ద జరిగిన సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. గురువారం వేకుమజామునే తన అన్నతో కలిసి తాత సమాధి వద్దకు నివాళులు అర్పించడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

అనంతరం.. ఘాట్ వద్దకు వచ్చిన బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలంటూ హుకుం జారీచేశారు! ఈ విషయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగా పలువురు రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, అభిమానులు, నెటిజన్లు.. బాలకృష్ణ తీరును తప్పుపట్టారు. ఇలాంటి పనుల వల్ల జూనియర్ కి ఊడేదేమీ లేదని గట్టిగా ఇచ్చిపడేశారు! ఈ సమయంలో జూనియర్ ఫ్యాన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.

ఈ సందర్భంగా... తన తాత ఘాట్ వద్ద తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను తొలగించమనడానికి అసలు బాలకృష్ణకు ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్న అభిమానులు... అది ప్రభుత్వ స్థలం, పైగా ఒకప్పుడు అక్కడ అన్నీ తానై చూసుకున్నది తారక్.. అప్పుడు మీరంతా ఏమి చేస్తున్నారో మీకే తెలియాలని గతాన్ని గుర్తు చేస్తున్నారు! ఈ సందర్భంగా వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంటూ నెట్టింట ఒక విషయం వైరల్ అవుతుంది.

అవును... ఎన్టీఆర్ ఘాట్ వద్ద తమ అభిమాన హీరోకి జరిగిన అవమానాన్ని ఆయన అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తుంది. భరించే కొద్దీ బాధిస్తున్నారని.. విధేయతకూ, బానిసత్వానికీ తేడా తెలియని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారని.. ఒక్కసారి కౌంటర్ అటాక్ ఇస్తే ఇక గమ్మునుంటారని ఫ్యాన్స్ నెట్టింట చర్చిస్తున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో... బాలకృష్ణ ఇంటికి సమీపంలో ఒక భారీ ఫ్లెక్స్ పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది.

ఇందులో భాగంగా హైదరబాద్ లోని బాలకృష్ణ ఇంటికి వెళ్లి వచ్చే దారిలో అటు కేబీఆర్ సమీపంలో కానీ, ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ పెట్రోల్ బంక్ పైన కానీ, అటు ఫిల్మ్ నగర్ పైకి వెళ్లే మార్గంలో కానీ "సీనియర్ - జూనియర్" ల కాంబినేషన్ లో అసలు సిసలు వారసుడు అన్నట్లుగా ఒక భారీ ఫ్లెక్స్ పెట్టాలని భావిస్తున్నారని తెలుస్తుంది. అందుకు అవసరమైన అనుమతులన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారుల నుంచి తీసుకుని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని అంటున్నారు.

అలా జరిగితే... అప్పుడు బాలకృష్ణ వాటిని ఎలా తొలగిస్తారో చూస్తామంటూ కొంతమంది అభిమానులు ఆలోచిస్తున్నారని.. ఫైరవుతున్నారని తెలుస్తుంది! ఇదే సమయంలో... వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ ప్రచారం చేసే ప్రతీ చోటా ఈ విధంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారని సమచారం. ఈ మాత్రం రియాక్షన్ ఇవ్వకపోతే మరింతగా అవమానిస్తారని చెబుతున్నారు.

కొంతమంది అహంకారమో, మితిమీరిన సంకుచిత స్వభావ ప్రభావం వల్లో కానీ... గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగిన విషయాన్ని మాత్రం జూనియర్ అభిమానులు లైట్ తీసుకోరనే తెలుస్తుంది. మరి ఈ వ్యవహారం ఎలా శాంతిస్తుందనేది వేచి చూడాలి!