Begin typing your search above and press return to search.

అందమైన పర్సు..అందులో నోట్లు.. వైరల్ గా మారిన ఎల్ బీ నగర్ వీడియో

వైరల్ వీడియో ఒకటి ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ బీ నగర్ ఒకటి.

By:  Tupaki Desk   |   27 Nov 2023 6:49 AM GMT
అందమైన పర్సు..అందులో నోట్లు.. వైరల్ గా మారిన ఎల్ బీ నగర్ వీడియో
X

వైరల్ వీడియో ఒకటి ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 నియోజకవర్గాల్లో తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ బీ నగర్ ఒకటి. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు గెలిచిన వారంతా బీఆర్ఎస్ యేతర పార్టీల వారే తప్పించి.. గులాబీ జెండా ఒక్కసారి ఎగిరింది లేదు. దీంతో.. ఈసారి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేలా చేసి.. ఎల్ బీనగర్ లో గులాబీ పార్టీ ఖాతా ఓపెన్ చేయాలన్న పట్టుదలతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు.

ఇదిలాఉంటే.. తాజాగా సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వీడియో ఒకటి ఎల్ బీ నగర్ బీఆర్ఎస్ అభ్యర్థికి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఇది నిజమైన వీడియోనా? లేదంటే ప్రత్యర్థులు కావాలని దెబ్బ కొట్టేలా చేసేందుకు వేసిన ఎత్తుగడా అన్నది ప్రశ్నగా మారింది. నీట్ గా ప్యాక్ చేసిన ఒక గిఫ్టు పాకెట్ ను తెరిచే ప్రయత్నంచేస్తూ.. ఆ పాకెట్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సతీమణి పంచినట్లుగా పేర్కొన్నారు.

గిఫ్టు రేపర్ ను విప్పి చూడగా.. అందులో అందమైన పర్సు ఉండటం.. ఆ పర్సు జిప్ తీసి చూడగా అందులో నాలుగు రూ.500 నోట్లు ఉండటం కనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. అందమైన పర్సు.. అందులో ఏముంది? అన్న మాటతో ఉన్న ఈ వీడియో అధికాఆరోపణలు ర పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. సాధారణంగా అభ్యర్థి మీద ఆరోపణలు రావటం సహజం. కానీ.. తాజా ఎపిసోడ్ లో మాత్రం అభ్యర్థి సతీమణి పేరు మీద వచ్చిన వీడియో అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది. అది నిజం గా వాళ్ళు ఇచ్చారా లేక ఫేక్ వీడియో చేసారా అనేది తెలియాల్సి ఉంది.