Begin typing your search above and press return to search.

ఫోన్‌లో జేడీ వాన్స్ మీమ్.. అమెరికా నుండి నార్వే పౌరుడి బహిష్కరణ!

ఇంకా అతని ఫోన్‌లో ఉన్న మరొక ఫోటో కూడా అధికారులకు నచ్చలేదట. అందులో మిక్కెల్‌సన్ ఒక చెక్క పైపు పట్టుకున్నట్లు కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 11:38 PM IST
ఫోన్‌లో జేడీ వాన్స్ మీమ్.. అమెరికా నుండి నార్వే పౌరుడి బహిష్కరణ!
X

ట్రంప్ పరిపాలనలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోందని, ముఖ్యంగా విదేశీయులు, విద్యార్థుల పట్ల మరింత నిఘా పెట్టిందని తెలిసిందే. వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారని సమాచారం.

ఇలాంటి సమయంలో ఒక కొత్త ఘటన వెలుగులోకి వచ్చింది. నార్వేకు చెందిన 21 ఏళ్ల టూరిస్ట్ మాడ్స్ మిక్కెల్‌సన్‌ అనే యువకుడు, అమెరికా వెళ్లిన తర్వాత న్యూజెర్సీ విమానాశ్రయంలో అతన్ని అధికారులు నిలిపి, చివరికి దేశం నుంచి వెనక్కు పంపించారు. దీనికి కారణం అతని ఫోన్‌లో ఉన్న ఒక మీమ్!

ఆ మీమ్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌ను బొమ్మలా, చమత్కారంగా బోనులో చిత్రించినట్లు ఉంది. విమానాశ్రయానికి దిగిన వెంటనే అతనిని అధికారులు అడిగి తెలుసుకోవడం మొదలుపెట్టారు. తరువాత ఒక ప్రత్యేక గదికి తీసుకెళ్లి, అతని షూలు, బ్యాగ్‌, మొబైల్‌ అన్నీ తీసుకున్నారు.

ఆ తర్వాత అధికారులు అతనిపై నేర ఆరోపణలు చేయడం ప్రారంభించారని మిక్కెల్‌సన్ తెలిపాడు. డ్రగ్‌ ట్రాఫికింగ్, ఉగ్రవాద కుట్రలు, కట్టుదిట్టమైన అతి హిందూత్వ భావజాలం వంటివాటికి అతను ముడిపడి ఉన్నాడని ఆరోపించారు.

“ఆ మీమ్‌ నాకు ఒక చాట్‌ గ్రూప్‌ ద్వారా పంపబడింది. ఆటోమాటిక్‌గా నా ఫోన్‌లో సేవ్ అయింది. అది పూర్తిగా సరదాగా పంపబడింది, నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అంతే కానీ అది నా దేశ ప్రవేశాన్ని అడ్డుకుంటుందని ఊహించలేదు.” అని నార్వే యువకుడు వాపోయాడు.

ఇంకా అతని ఫోన్‌లో ఉన్న మరొక ఫోటో కూడా అధికారులకు నచ్చలేదట. అందులో మిక్కెల్‌సన్ ఒక చెక్క పైపు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘‘ఫోన్‌ను అన్‌లాక్‌ చేయాలంటూ అధికారులు ఒత్తిడి చేసారు. చేయకపోతే జైలుకు పంపిస్తామని, లేకపోతే $5000 ఫైన్ వేస్తామని బెదిరించారట.’’

- విమర్శల పాలవుతున్న అమెరికా వీసా విధానాలు

ఈ ఘటనపై నార్వేజియన్ మీడియా మండిపడుతోంది. వ్యక్తిగత గోప్యత, స్వేచ్ఛల మీద యూఎస్‌లోని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా వీసా విధానాలపై ఇప్పుడు మరింత చర్చ మొదలైంది. ఒక మీమ్ కారణంగా ఒక పౌరుడిని దేశం నుంచి బహిష్కరించడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.

ఈ సంఘటన అమెరికా ప్రవేశ నిబంధనలు ఎంత కఠినంగా మారాయో, సామాజిక మాధ్యమాల్లోని కంటెంట్‌ను అధికారులు ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నారో స్పష్టం చేస్తుంది.