6 ఏళ్ల బాలిక పై 10, 13, 16 ఏళ్ల బాలురు గ్యాంగ్ రే*ప్.. షాకింగ్ అప్ డేట్స్ ఇవిగో!
ఈ క్రమంలో మరో దారుణం చోటు చేసుకోగా.. అందులో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
By: Raja Ch | 29 Jan 2026 5:28 PM ISTనేరాలు, ఘోరాలు, దారుణాలు.. నేటి సమాజంలో అత్యంత నిత్య కృత్యాలు! భార్యను చంపిన భర్త, ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య, ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని తల్లితండ్రులను చంపిన కూతురు, ఆస్తి కోసం కన్నవారిని పొట్టబెట్టుకున్న కొడుకు, అక్రమ సంబంధం కోసం కన్న పిల్లలను చంపిన తల్లి... వినడానికే అత్యంత జుగుప్స కలిగించేలా ఉన్న సంఘటనలు నిత్యం ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి! ఈ క్రమంలో మరో దారుణం చోటు చేసుకోగా.. అందులో కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును... పాపం తెలియని పసి వయసు.. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే తెలుసుకోలేని ప్రాయం.. అన్నయ్య వయసున్నవాళ్లు పిలిచారంటే ఏ చాక్లెట్టో, బిస్కట్టో ఇస్తారని పరిపూర్ణంగా నమ్మే మనసు.. కనీసం ఆటలు ఆడిస్తారనే ఆశ.. క్షేమంగా చూసుకుంటారనే నమ్మకం. కానీ.. మైనర్లు అయిన ముగ్గురు బాలురు.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలోని ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మూడో బాలుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఈశాన్య ఢిల్లీలోని భజన్ పురా ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై 10, 13, 16 ఏళ్ల వయస్సు గల ముగ్గురు బాలురు ఆమెను ప్రలోభ పెట్టి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ సమయంలో రక్తపు మరకలతో ఇంటికి వచ్చిన ఆ బాలికను తల్లి అడగడంతో.. ఏమి చెప్పాలో తెలియని ఆ బాలిక.. తల్లికి ఏదో చెప్పింది.. తల్లి అసలు విషయం గ్రహించింది. అనంతరం బాలిక కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగారు.
ఈ సమయంలో ఈ కేసులో ఇద్దరు బాలురను పోలీసులు అరెస్ట్ చేయగా.. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన దర్యాప్తు అధికారులు.. ముగ్గురు బాలురు, ఆ బాలికను ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు.. ఇందులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచామని.. మూడో బాలుడి కోసం గాలింపు చేపట్టామని తెలిపారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది!
ఈ సందర్భంగా స్పందించిన బాలిక తల్లి... ఆమె రక్తంతో ఇంటికి వచ్చినప్పుడు తాను, ఏమైందని అడిగానని.. ఆమె మొదట పడిపోయినట్లు చెప్పిందని.. అయితే, ఆమె శరీరంలోని ఇతర భాగాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో మరింతగా ప్రశ్నించగా.. అప్పుడు ఏమి జరిగిందో ఆమె చెప్పిందని తల్లి తెలిపారు. ఈ సమయంలో.. తన కుమార్తె పరిస్థితి చూసి పదేళ్ల బాలుడి తల్లి, తన కొడుకుని స్వయంగా పోలీసులకు అప్పగించిందని వెల్లడించారు.
ఈ సమయంలో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారని.. ఆమెకు తగిన కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పిన బాధితురాలి తల్లి.. ఆ అబ్బాయిలు బాలికను టెర్రస్ పైకి తీసుకెళ్లారని.. దర్యాప్తు సమయంలో ఆ ప్రదేశంలో రక్తపు మరకలు కనిపించాయని ఆరోపించారు.. ఇదే సమయంలో ముగ్గురు నిందితులు అదే ప్రాంతానికి చెందినవారని తెలిపారు. ఈ సందర్భంగా... బాధ్యులందరికీ కఠిన శిక్ష విధించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
