రష్యాకు మద్దతుగా కిమ్ సంచలన నిర్ణయం... తెరపైకి షాకింగ్ విషయం!
ఇటీవల ప్యాంగ్ యాంగ్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా ప్రతినిధులు కూడా పాల్గొని, తమ కోసం పోరాడిన ఉ.కొరియా సైన్యానికి నివాళులు అర్పించారు.
By: Tupaki Desk | 3 July 2025 3:47 PM ISTఇటీవల ఉత్తర కొరియా - రష్యాల మధ్య సైనిక సహకార ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా... ప్యాంగ్ యాంగ్ లోని ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తర కొరియా సైనికులు రష్యా కోసం చేసిన పోరాటాలను గుర్తుచేసుకొన్నారు. ఆ పోరాటాల్లో మృతి చెందిన సైనికుల మృతదేహాలను చూసి కిమ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు! ఈ సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు!
అవును... ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంతో తమకు సంబంధం లేదని.. ఈ యుద్ధంలో తమ సైనికులు రష్యాతో యుద్ధంలో లేరని ఇంతకాలం బుకాయించిన ఉత్తరకొరియా... ఇటీవల విడుదల చేసిన వీడియోలో ఓపెన్ అయిపోయిన సంగతి తెలిసిందే! ఇటీవల ప్యాంగ్ యాంగ్ లో జరిగిన కార్యక్రమంలో రష్యా ప్రతినిధులు కూడా పాల్గొని, తమ కోసం పోరాడిన ఉ.కొరియా సైన్యానికి నివాళులు అర్పించారు.
ఈ సమయంలో రష్యా కోసం కిమ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా మరో 30,000 మంది వరకు సైనికులను పంపేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఈ మేరకు కీవ్ ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ సీ.ఎన్.ఎన్. వెల్లడించింది. త్వరలో ఈ సైనిక బృందాలు రష్యాకు చేరుకోనున్నాయని తెలిపింది.
ఇదే సమయంలో... ఉత్తర కొరియా నుంచి సైనికులను రవాణా చేసేందుకు ఇప్పటికే రష్యా విమానాలు సిద్ధమవుతున్నాయని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఉ.కొరియా సైనిక బృందాలను సైబిరియా మీదుగా ఉక్రెయిన్ లోకి పంపనున్నాయని అంటున్నారు. గతేడాది సైనికులను తరలించేందుకు వాడిన నౌక ఒకటి రష్యా ఓడరేవులో తాజాగా లంగరు వేయడం, ఉ.కొరియా విమానాశ్రయంలో మాస్కో కార్గో విమానం కనిపించడం దీనికి సాక్ష్యం అని అంటున్నారు!
ఈ సందర్భంగా... గతేడాది క్రస్క్ ప్రాంతంలోకి ఉక్రెయిన్ సేనలు చొచ్చుకురావడంతో.. నవంబర్ లో దాదాపు 11,000 మంది సైనికులను కిమ్ ప్రభుత్వం పంపించిందని.. అందులో సుమారు 4,000 మంది వరకు యుద్ధ భూమిలో చనిపోవడమో.. గాయపడటమో జరిగిందని సీ.ఎన్.ఎన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈసారి ఏకంగా 30,000 మందిని పంపనున్నట్లు పేర్కొంది!
కాగా.. ఇటీవల ఉక్రెయిన్ కు ట్రంప్ షాకిచ్చిన సగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్పందించిన రక్షణ శాఖ... కొన్ని రకాల ఆయుధాలను ఉక్రెయిన్ కు అందించడానికి గతంలో బైడెన్ ప్రభుత్వం అంగీకరించిందని.. అయితే, ఇటీవల తమ ఆయుధ నిల్వలను సమీక్షించిన తర్వాత.. ఉక్రెయిన్ కు ఇస్తామని హామీ ఇచ్చిన ఆయుధాల నిల్వలు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించి.. ఇకపై పంపించొద్దని నిర్ణయించినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ అధికార ప్రతినిధి అన్నా కేలీ... తమ సొంత అవసరాలు తీరిన తర్వాతే ఇతర దేశాలకు ఆయుధ సాయం చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే... ఉక్రెయిన్ కు అమెరిక నిలిపివేసిన ఆ ఆయుధాలు ఏమిటి.. ఎలాంటివి అనే వివరాలను మాత్రం అటు వైట్ హౌస్ కానీ, ఇటు రక్షణ శాఖ కానీ వెల్లడించలేదు.
రష్యాతో యుద్ధం రోజురోజుకీ మరింత ముదురుతున్న వేళ.. ఉక్రెయిన్ కు అమెరికా నుంచి తగిలిన బిగ్ షాక్ గా దాన్ని భావిస్తున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఏకంగా 30,000 మంది సైన్యాన్ని పంపించడం అంటే.. ఇది ఉక్రెయిన్ కు మరో బిగ్ షాకని చెబుతున్నారు.
