ఈ నియంతృత్వం పీక్స్... ఫోన్ లోని మెసేజ్ లపైనా కిమ్ పెత్తనం!
కిమ్ అధికారంలో ఉన్న ఉత్తరకొరియాలోని పౌరులకు ప్రపంచంలో ఎవరికీ లేనన్ని, చాలామంది ఊహించనన్ని కండిషన్స్ ఉంటాయి
By: Tupaki Desk | 1 Jun 2025 7:00 PM ISTకిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కిమ్ అధికారంలో ఉన్న ఉత్తరకొరియాలోని పౌరులకు ప్రపంచంలో ఎవరికీ లేనన్ని, చాలామంది ఊహించనన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ పౌరులకు బాహ్య ప్రపంచంలో సంబంధం లేదు! ఈ సమయంలో ఆ దేశంలో ప్రజల ఫోన్ లోని మెసేజ్ లపైనా కిమ్ పెత్తనం చేస్తున్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... నియంతృత్వంలో ఇప్పటికే పీక్స్ ను చూపించేస్తున్న కిమ్.. తాజాగా అంతకు మించి అనే పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఉత్తర కొరియా ప్రజలు వినియోగించే ఫోన్లపై కూడా కిమ్ సర్కార్ నిఘా వేసినట్లు తెలుస్తోంది. అక్కడ వాడే మొబైల్స్ లో కొన్ని రకాల పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వీటిలో ప్రధానంగా దక్షిణ కొరియాలో వాడే పదాలు ఆటో కరెక్ట్ అవుతున్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా... దక్షిణ కొరియాలో స్నేహితుడిని "ఒప్పా" అని అంటారు. దీనికి పెదన్న అనే అర్ధం కూడా ఉంది. కానీ.. ఉత్తర కొరియాలోని ఫోన్లలో ఒప్పా అనే పదం టైప్ చెస్తే అది ఆటోమెటిక్ గా "కాంమ్రెడ్" అని మరిపోతుంది. దీంతో పాటు కీ బోర్డు కీంద ఒక వార్నింగ్ కూడా కనిపిస్తుంది.
ఇందులో భాగంగా.. స్నేహిటుడిని, సోదరులను కామ్రెడ్ అని పిలవాలని ఆ వార్నింగ్ సూచిస్తుంది. ఇదే సమయంలో... మెసేజ్ లో దక్షిణ కొరియా అని టైప్ చేస్తే.. అది ఆటోమెటిక్ గా "పప్పేట్ స్టేట్" (కీలుబొమ్మ దేశం) అని కరెక్ట్ అయిపోతుంది. ఈ స్థాయిలో కిమ్ సర్కార్ ఉత్తరకొరియా ప్రజల మెసేజ్ ల పైనా పెత్తనం చేస్తోందని అంటున్నారు.
ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే... ఫోన్ స్క్రీన్ షాట్లపైనా కిమ్ సర్కార్ నిఘా ఉంచింది! ఇందులో భాగంగా.. ఫోన్లలో ప్రతీ ఐదు నిమిషాలకు ఒకసారి వారి స్క్రీన్ షాట్లు ఓ ఫోల్డర్ లో ఆటోమెటిక్ గా సేవ్ అవుతున్నాయి. అయితే.. ఆ ఫోల్డర్ ని తెరిచే అవకాశం మాత్రం సదరు వినియోగదారుడికి ఉండదు.. ఆ దేశ అధికారులు ఆ ఫోల్దర్ పై యాక్సెస్ ని కలిగి ఉంటారు.
సుమారు 649 మంది ఉత్తరకొరియ ఫిరాయింపుదారుల సాక్ష్యాలను కలిగి ఉన్న నివేదిక ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని పాలన పాశ్చాత్య ప్రభావం, బాహ్య ప్రపంచమం గురించిన సమాచారం తెలుసుకోవడం వంటివాటిని అణిచివేస్తుంది. ఇటీవల ఆ అణిచివేతను ముమ్మరం చేసింది. ఈ సమయంలో అధికారుల మొబైల్ ఫోన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు.
ఇక ఉత్తరకొరియాలో విదేశీ సంస్కృతి ప్రభావాన్ని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన కె-పాప్, కె-డ్రామాలు, దక్షిణ కొరియా సంగీతం, టెలివిజన్ నాటకాలను కూడా కిమ్ పూర్తిగా నిషేధించారు.
