Begin typing your search above and press return to search.

లగ్జరీ క్రూస్ షిప్ లో వైరస్ కలకలం... 200 మంది పరిస్థితి ఇదే!

ఈ సమయంలో ఓ విలాసవంతమైన క్రూస్ షిప్ లో నోరో వైరస్ కలకలం రేపుతోంది. దీంతో.. అందులో ప్రయాణిస్తున్న 200 మంది హెల్త్ పరిస్థితిపై కథనాలు వెలువడుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 April 2025 11:55 AM IST
లగ్జరీ క్రూస్ షిప్ లో వైరస్  కలకలం... 200 మంది పరిస్థితి ఇదే!
X

గత కొంతకాలంగా ఎటు చూసినా ఏదో ఒక మూల వైరస్ అనే మాట వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. పేరు వేరైనా, తీవ్రతలో తేడా ఉన్నా.. దాదాపు ప్రతీ చోటా మనిషిని మంచాన్న పడేసే వైరస్ లు హల్ చల్ చేస్తూనే ఉన్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఓ విలాసవంతమైన క్రూస్ షిప్ లో నోరో వైరస్ కలకలం రేపుతోంది. దీంతో.. అందులో ప్రయాణిస్తున్న 200 మంది హెల్త్ పరిస్థితిపై కథనాలు వెలువడుతున్నాయి.

అవును... ఒక విలాసవంతమైన భారీ టూరిస్ట్ నౌకలో నోరా వైరస్ కలకలం రేపుతోందనే విషయం సంచలనంగా మారింది. ఇందులో భాగంగా... సౌతాంప్టన్ తూర్పు కరేబియన్ కు బయలుదేరిన క్వీన్ మేరీ 2 విలాసవంతమైన నౌకలో ఈ వైరస్ కలకలం రేఫుతోంది. దీంతో.. 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది!

వివరాళ్లోకి వెళ్తే... మార్చి 8న సౌతాంప్టన్ నుంచి క్వీన్ మేరీ 2 కునార్డ్ లైన్స్ అనే క్రూయిజ్ నౌక ఈస్ట్ కరేబియన్ కు బయలుదేరింది. ఆ సమయంలో షిప్ లో 2,538 మంది ప్రయాణికులు.. 1,232 మంది సిబ్బంది ఉండగా... వారిలో 224 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఈ వైరస్ బారినపడినట్లు నిర్ధారణ అయ్యింది. మార్చి 18న ఈ నౌక న్యూయర్క్ లో ఆగగా.. అప్పుడే ఈ వైరస్ వ్యాపించినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన కునార్డ్... వైరస్ బారిన పడినవారికి చికిత్స అందించడంతోపాటు నౌకను సానిటైజ్ చేసినట్లు తెలిపింది. మిగిలిన వారికి ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోన్నట్లు వెల్లడించింది. ఇది మొత్తం 29 రోజుల ట్రిప్ కాగా.. ఏప్రిల్ 6న ముగియనుంది.

ఏమిటీ నోరావైరస్?:

అన్ని వయసులవారికీ సోకే లక్షణం ఉన్న ఈ నోరా వైరస్... కలుషితమైన ఆహారం కారణంగా మన శరీరంలోకి ప్రవేశిస్తుందని అమెరికన్ సీడీసీ వెల్లడించింది. ఈ వైరస్ సోకిన రెండు రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయని.. అవి కనీసం మూడు రోజుల వరకూ ఉంటాయని సీడీసీ తెలిపింది.

వాంతులు, విరేచనాలు, వికారం, కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ వంటి లక్షణాల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. ఈ వైరస్ బారినపడిన వ్యక్తులు వాడిన పాత్రలు, ఆహారం పంచుకోవడం ద్వారా కూడా ఇది వ్యాప్తిస్తుందని చెబ్బుతున్నారు.