Begin typing your search above and press return to search.

నోబెల్ ప్రైజ్ మనీని భారీగా పెంచేశారుగా?

తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం నోబెల్ నగదు పురస్కారం కింద ఇకపై 11 మిలియన్ క్రోనార్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 2:30 PM GMT
నోబెల్ ప్రైజ్ మనీని భారీగా పెంచేశారుగా?
X

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు.. పురస్కారాలు ఉన్నాయి. వాటిల్లో ఏ పురస్కారం వచ్చినా రాకున్నా.. సినిమాలకు సంబంధించి అస్కార్.. వివిధ రంగాలకు సంబంధించిన నోబెల్ పురస్కారం వస్తే చాలు.. జీవితం ధన్యం అయిపోతుందని చెబుతారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి.. మానవాళికి మేలు చేసే మేధావులకు అందించే నోబెల్ పురస్కారానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. అలాంటి నోబెల్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న వారికి ఒక మిలియన్ క్రోనార్ల మొత్తాన్ని ఇస్తారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.74.8 లక్షల మొత్తాన్ని ఇస్తారు.

అయితే.. నోబెల్ పురస్కారం పొందే వారికి ఇచ్చే నగదు బహుమతిని భారీగా పెంచేస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది నోబెల్ ఫౌండేషన్. ఇటీవల కాలంలో స్వీడన్ కరెన్సీ విలువ పడిపోవటంతో పాటు.. పురస్కారానికి అందించే నగదు విలువను పెంచేందుకు తాజా నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం నోబెల్ నగదు పురస్కారం కింద ఇకపై 11 మిలియన్ క్రోనార్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మన రూపాయిల్లో ఈ మొత్తం రూ.81.5 కోట్లకు సమానం కావటం గమనార్హం.

నోబెల్ బహుమతుల్ని తొలిసారి 1901లో ప్రధానం చేసినప్పుడు ఒక్కో కేటగిరికి 1.5 లక్షల క్రోనార్లను ఇచ్చేవారు. అప్పటి నుంచి నోబెల్ ఫౌండేషన్ నగదు పురస్కారాన్ని పెంచుకుంటూ వస్తోంది. తాజాగా చేసిన ప్రకటన జీవితకాలంలోనే అత్యధిక మొత్తంగా చెబుతున్నారు. ఈ ఏడాది నోబెల్ పురస్కారాల జాబితాను వచ్చే నెలలో (అక్టోబరు)లో ప్రకటించనున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తాజాగా అమెరికా డాలర్.. యూరోలతో పోలిస్తే క్రోనార్ విలువ ఇంత భారీగా తగ్గిపోవటం ఇదే తొలిసారి.